అవీ ఇవీ

Anna Konidela: ‘ఆమె నేను కాదు’

పవన్ కళ్యాణ్ భార్య అన్నా కొణిదెల (Anna Konidela aka Anna Lezhneva) ఇటీవల ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేశారు. దాంతో వరుసగా తన ఫోటోలు, వీడియోలు, మంచి మంచి పోస్టులు పెడుతున్నారు. తాజాగా తన భర్త పవన్ కళ్యాణ్ తో పాటు తీన్ మార్ లో నటించిన డానా మార్క్స్ (Dana Marks) ఫోటోని షేర్ చేసింది. ఆ ఫొటోలో ఉన్నది తాను కాదు అని క్లారిటీ ఇచ్చింది.

“ఆమె నేను కాదు,” అని ఫోటో షేర్ చేసి క్లారిటీ ఇచ్చింది. అలాగే మరో ఫోటో పెట్టిన, ఇది నేను అంటూ క్లారిటీ ఇచ్చింది. ఈ కొత్త ఫొటోలో ఆమె జిమ్ లో కష్టపడుతూ ఉంది.

తన జీవితంలో ఎప్పుడూ ఒక మోడల్ లా, హీరోయిన్ లా స్లిమ్ గా లేను అని తెలిపింది. “ఎందుకో తెలీదు అందరూ డానా మార్క్స్ ఫోటోని చూసి నేను ఏమో అనుకోని పొరపడ్డారు. కానీ ఆమె నేను కాదు,” అని క్లారిటీగా తెలిపింది.

పవన్ కళ్యాణ్ సరసన పలువురు ఫారిన్ భామలు నటించారు “తీన్ మార్” చిత్రంలో. అదే సమయంలో అన్నాతో పవన్ కళ్యాణ్ ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత ఆమెని పెళ్లి చేసుకున్నారు. అందుకే, ఆ డాన్ మార్క్స్ అనే ఫారిన్ నటిని అన్నా అని అందరూ పొరపడ్డారు. చాన్నాళ్ళూ అన్నా గురించి రాసేటప్పుడు మీడియా ఆ ఫోటోని ప్రచురించేది. ఇప్పుడు అందరికీ క్లారిటీ వచ్చింది.

పవన్ కళ్యాణ్ రేణు దేశాయికి విడాకులు ఇచ్చాక అన్నాని పెళ్లి చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఏం అయ్యాక ఆమె పూర్తిగా భర్తతోనే ఉంటున్నారు. గతంలో కొన్నాళ్ళు రష్యాలో, సింగపూర్ లో ఉండేవారు. ఇప్పుడు పూర్తిగా హైదరాబాద్ కి షిప్ట్ అయ్యారు. అటు హైదరాబాద్ లోనూ, అప్పుడప్పుడు అమరావతిలోనూ ఉంటారు. ఆమెకి ఇద్దరు పిల్లలు, ఒక బాబు, ఒక కూతురు.

కొడుకు మార్క్ శంకర్ సింగపూర్ లో చదువుతుండగా స్కూల్లో ప్రమాదం జరగడంతో మొత్తం ఫ్యామిలీని ఇక్కడికి షిఫ్ట్ చేయించారు పవన్ కళ్యాణ్. తాజాగా అన్నా అటు బరువు తగ్గే ప్రయత్నం చేస్తూ ఇటు ఇన్ స్టాగ్రామ్ లో మంచి మంచి పోస్టులు చేస్తూ బిజీగా ఉన్నారు.

TeluguCinema

Recent Posts

పోకిరి అంటే పిచ్చి అంటున్న Akhil Akkineni

రామ్ చరణ్ పై తనకున్న అభిమానాన్ని ఇప్పటికే చాటుకున్నాడు అఖిల్ (Akhil Akkineni). తాజాగా ఎన్టీఆర్ తో తన అనుబంధాన్ని…

7 hours ago

Jana Nayagan: విజయ్ కోసం కఠినమైన రూల్స్

తమిళనాడు ముఖ్యమంత్రి, కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం 'జన నాయగన్' (Jana Nayagan) రిలీజ్…

7 hours ago

నా ఫిట్ నెస్ సీక్రెట్ అదే: Kajal Aggarwal

పెళ్లయి, బాబుకు తల్లి అయినప్పటికీ, ఇప్పటికీ సన్నజాజి తీగలా మెరిసిపోతోంది కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal). కుర్ర హీరోయిన్లకు ఏమాత్రం…

18 hours ago

Bhagyashri Borse: ఒక్క విజయం 2 కోట్ల భాగ్యం

భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse)కి ఐదు సినిమాల తర్వాత మొదటి విజయం దక్కింది. ఒక్క సినిమా హిట్ కాకపోయినా అనేక…

1 day ago

Prince Cecil: వైవాహిక బంధంలోకి మరో నటుడు

సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఒక్కొక్కరుగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. బ్రహ్మచారి జీవితానికి గుడ్ బై చెప్పేస్తున్నారు. ఇదే బాటలో తాజాగా…

1 day ago

Nabha Natesh: రెండు సినిమాలపై ఆశలు, ఒకటి పోయింది

నభా నటేష్ (Nabha Natesh) ఈ ఏడాది రెండు భారీ సినిమాలపై ఆశలు పెట్టుకొంది ఒకటి నాగబంధం (Nagabandham), మరోటి…

1 day ago