హీరో రామ్ చరణ్ (Ram Charan) ఇటీవల ఈస్క్వేర్ (Esquire) అనే మేగజైన్ కోసం ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చాడు. హాంగ్ కాంగ్ వెళ్లి మరీ ఈ మేగజైన్ కోసం ఫోటోషూట్ చేశాడు. ఈ ఇంటర్వ్యూలో తన కెరీర్ మొదలుకొని తన సినిమాల సెలెక్షన్ నుంచి తన ఆధ్యాత్మిక భావనల వరకు అన్నీ విషయాల్లో మనసు విప్పి మాట్లాడాడు.
రామ్ చరణ్, ఉపాసనకి ముగ్గురు పిల్లలు. మొదట కూతురు క్లిన్ కారా పుట్టగా, రీసెంట్ గా ఒక అమ్మాయి, ఒక అబ్బాయి కవలలుగా పుట్టారు. ఈ ముగ్గురు పిల్లలను రిచ్ కిడ్స్ గా పెంచే ఆలోచనలో లేరంట. వారు ధనవంతుల, సెలెబ్రిటీల పిల్లలుగా కానుందా స్వతంత్రంగా పెరిగేలా చూస్తాను అని అంటున్నాడు.
అంతే కాదు తాను పిల్లల విషయంలో సాఫ్ట్ గా ఉండను అని చెప్తున్నాడు. “తల్లిదండ్రుల్ని చూసి పిల్లలు నేర్చుకుంటారు. నేను అలానే నేర్చుకున్నాను. మా పిల్లలు కూడా అలానే నేర్చుకోవాలనుకుంటాను. అందుకే, కొంచెం నేను స్ట్రిక్ట్ గానే ఉంటాను,” అని వివరించాడు రామ్ చరణ్.
ఇక అయ్యప్ప స్వామి మాల ప్రతి సంవత్సరం వేసుకోవడం వల్ల తన జీవితంలో ప్రశాంతత వచ్చింది అని తెలిపాడు. వ్యక్తిగా తనలో చాలా మంచి మార్పు తెచ్చిందట.
'చెన్నై లవ్ స్టోరీ' (Chennai Love Story సినిమాతో థియేటర్లలోకి వచ్చాడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). శ్రీ గౌరీప్రియ…
తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన ‘జన నాయకుడు’ (తమిళంలో జన నయగన్) తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే…
సామజవరగమన సినిమా తర్వాత శ్రీ విష్ణు, దర్శకుడు రామ్ అబ్బరాజు మరోసారి చేతులు కలిపారు. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి…
'టాక్సిస్' (Toxic) సినిమాపై కొన్ని రోజులుగా నడుస్తున్న ట్రోలింగ్ కు సింపుల్ గా, సుత్తిలేకుండా కౌంటర్ ఇచ్చారు నిర్మాత వెంకట్…
పరిశ్రమలో ప్రతి ఒక్కరికి చేదు అనుభవాలు, జ్ఞపకాలు ఉంటాయి. నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali)కి కూడా…
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్‌లో నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన అద్భుతమైన స్టైలింగ్‌తో అందరి…