పూరి జగన్నాధ్ ఇటీవలే కొత్త సినిమా ప్రకటించాడు. తెలుగులో ఏ హీరో డేట్స్ ఇవ్వకపోవడంతో ఈ సారి తమిళ్ హీరో విజయ్ సేతుపతిని ఒప్పించాడు. ఒక హీరోయిన్ గా టబును తీసుకున్నాడు. ఐతే, ఆమె హీరోయిన్ గా నటిస్తుందా లేక తల్లి పాత్ర పోషిస్తుందా లేక విలన్ గానా అన్నది క్లారిటీ లేదు.
టబుని ఒప్పించడంలో పూరి సక్సెస్ కావడం వెనుక భారీ పారితోషికం అనే మాట కూడా వినిపిస్తోంది.
టబు ఇటీవల అమెరికన్ వెబ్ సిరీస్ లో నటించింది. హాలీవుడ్ చిత్రాలు కూడా చేసింది. అలాగే ఆమె ఇటీవల నటించిన హిందీ చిత్రాలను నెట్ ఫ్లిక్స్, అమెజాన్ వంటి ఓటిటి సంస్థలు భారీ మొత్తానికి కొనుగోలు చేశాయి. దాంతో టబు ఒక సినిమాలో ఉంటే ఓటిటి డీల్ త్వరగా పూర్తి అవుతుంది అని బాలీవుడ్ నిర్మాతలు భావిస్తున్నారు.
ఈ లెక్కలు వేసుకొనే నిర్మాత ఛార్మి టబుని తీసుకొని ఉంటుంది అని అంటున్నారు. ఐతే, టబు కూడా తన లెక్కలు తాను వేసుకొని… పూరి సినిమాకి రెగ్యులర్ గా తీసుకొనే దానికన్నా ఎక్కువ డిమాండ్ చేసిందట.
టబు అడిగినంత ఇచ్చేందుకు పూరి ఒప్పుకున్నారు. ఎందుకంటే విజయ్ సేతుపతి, టబు అన్న కాంబినేషన్ వల్లే ఈ సినిమాకి అటెన్షన్ దక్కింది. త్వరలోనే షూటింగ్ మొదలు కానుంది.
"యానిమల్" చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన త్రిప్తి దిమ్రి (Tripti Dimri) మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రస్తుతం…
హీరోయిన్ కాయదు లోహర్ (Kayadu Lohar) తన పాఠశాల రోజుల్లో ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని బయటపెట్టింది. పదో తరగతి చదువుతున్న…
హీరో, దర్శకుడు, డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ఇలా అనేక విధాలుగా పాపులర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence). "ముని", కాంచన సినిమాల…
మహేష్ బాబు,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'గుంటూరు కారం' (Guntur Kaaram) సినిమా గురించి ఇప్పుడు ప్రత్యేకంగా…
పూజ హెగ్డే (Pooja Hegde)కి ఇప్పుడు లక్ తిరిగినట్టు కనిపిస్తోంది. ఆమెకి హిట్స్ లేవు కానీ వరుసగా అవకాశాలు వస్తూనే…
ఈ రోజు అల్లరి నరేష్ (Allari Naresh) పుట్టిన రోజు. దాంతో, నరేష్ కొత్త సినిమా "రంభ ఊర్వశి మేనక"…