వాణి కపూర్ గురించి పరిచయం అక్కర్లేదు. బాలీవుడ్ లో పలు సినిమాలు చేసింది. తెలుగులో కూడా నాని సరసన ఒక సినిమా చేసింది. ఐతే ఇటీవల కాలంలో ఆమె కెరీర్ అనేక సంక్షోభాలు చూస్తోంది. తాజాగా పాక్ వల్ల ఆమె కెరీర్ కి షాక్ తగిలింది.
వాణి కపూర్ నటించిన తాజా హిందీ చిత్రం… అబిర్ గులాల్. మే 9న విడుదలకు సిద్ధం అవుతోంది ఈ మూవీ. ఐతే, ఈ సినిమాలో హీరోగా నటించింది పాకిస్తాన్ కి చెందిన ఫహద్ ఖాన్. అదే సమస్యల్లోకి నెట్టింది వాణి కపూర్.
పహల్గామ్ ఉగ్రవాది దాడి నేపథ్యంలో పాకిస్తాన్ నటులకు సంబంధించిన అన్ని చిత్రాలను నిషేధించాలనే వాదన పెరిగింది. ఈ సినిమాని బాయ్ కాట్ చేస్తామని నెటిజన్స్ ట్రెండింగ్ చేశారు. దాంతో, ఈ సినిమా నిర్మాతలు ప్రస్తుతం విడుదలని ఆపేశారు.
మళ్ళీ ఎప్పుడు విడుదలవుతుందో, అవుతుందో లేదో కూడా చెప్పలేం. అసలే సినిమాలు లేవు, ఆఫర్లు రావడం లేదని బాధపడుతున్న వాణి కపూర్ కెరీర్ కి పాక్ టెర్రరిస్టుల దుశ్చర్య శాపంగా మారింది.
"యానిమల్" చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన త్రిప్తి దిమ్రి (Tripti Dimri) మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రస్తుతం…
హీరోయిన్ కాయదు లోహర్ (Kayadu Lohar) తన పాఠశాల రోజుల్లో ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని బయటపెట్టింది. పదో తరగతి చదువుతున్న…
హీరో, దర్శకుడు, డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ఇలా అనేక విధాలుగా పాపులర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence). "ముని", కాంచన సినిమాల…
మహేష్ బాబు,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'గుంటూరు కారం' (Guntur Kaaram) సినిమా గురించి ఇప్పుడు ప్రత్యేకంగా…
పూజ హెగ్డే (Pooja Hegde)కి ఇప్పుడు లక్ తిరిగినట్టు కనిపిస్తోంది. ఆమెకి హిట్స్ లేవు కానీ వరుసగా అవకాశాలు వస్తూనే…
ఈ రోజు అల్లరి నరేష్ (Allari Naresh) పుట్టిన రోజు. దాంతో, నరేష్ కొత్త సినిమా "రంభ ఊర్వశి మేనక"…