నయనతార (Nayanthara) పారితోషికం విషయంలో అసలు తగ్గేదే లే అనే పద్దతిలో ఉంటుంది. “మన శంకర వర ప్రసాద్ గారు” చిత్రం విషయంలో కూడా చెయ్యాలా వద్దా అని చాలా రోజులు ఊగిసలాడింది. 15 కోట్లు ఇవ్వాలని పట్టుబట్టి చివరికి 8 కోట్లు ప్లస్ జీఎస్టీ పారితోషికానికి ఒప్పుకొంది. అది కూడా మెగాస్టార్ చిరంజీవి చిత్రం, అనిల్ రావిపూడి మీరు మాత్రమే చెయ్యాలి అని పట్టుబట్టడంతో తగ్గింది.
కానీ తాజాగా బాలీవుడ్ చిత్రం విషయంలో మాత్రం తన పంతాన్ని నెగ్గించుకుంది అని టాక్.
సల్మాన్ ఖాన్ (Salman Khan), వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో రూపొందుతోన్న కొత్త హిందీ చిత్రంలో ఆమె హీరోయిన్. సక్సెస్ ఫుల్ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు.
బాలీవుడ్‌లో ఆమె షారుఖ్ సరసన “జవాన్” చిత్రంలో అరంగేట్రం చేసింది. రెండో చిత్రంగా ఇది ఒప్పుకొంది. ఏప్రిల్‌లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఐతే, ఈ సినిమాకి 15 కోట్ల పారితోషికం విషయంలో ఆమె తగ్గ లేదు. 13 కోట్లు ప్లస్ జీఎస్టీకి ఒప్పించింది. అంటే దాదాపుగా 15 కోట్లు.
హీరో నుంచి ముఖ్యమంత్రి కావడం అనేది అసాధారణ విజయం అని అంటున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi). కలలాంటి…
ఒక్క మే నెల తప్ప మార్చి నుంచి జూన్ వరకు వచ్చే ఏడాది సమ్మర్ (Summer 2027)లో ప్రతి నెలా…
టాలీవుడ్ నుంచి మరో మహిళా దర్శకురాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన 'సింగ్…
తమిళ స్టార్ విజయ్ చివరి చిత్రంగా తెరకెక్కిన 'జన నాయకుడు' (తమిళంలో 'జన నాయగన్') ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు…
హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త సస్పెన్స్…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో హడావిడిగా విడుదల తేదీ ప్రకటించి కనీసం రెండు, మూడు సార్లు విడుదల తేదీని వాయిదా వేసే…