ఒకప్పుడు హీరోగా ఎన్నో చిత్రాలు చేశారు రాజశేఖర్ (Rajashekar). హిట్స్ ఇచ్చారు. ఇటీవల ఆయన తండ్రి పాత్రలోకి వచ్చారు. స్పెషల్ రోల్స్ చేస్తున్నారు. తాజాగా శర్వానంద్ నటించిన “బైకర్”లో నటించారు. ఏప్రిల్ 3న విడుదల కానున్న ఈ సినిమా గురించి, తన కెరీర్ గురించి మీడియాతో ముచ్చటించారు.
బైకర్ చిత్రం అంగీకరించడానికి ప్రధాన కారణం ఏమిటి?
చాలా రోజుల తర్వాత నా సినిమా విడుదలవుతోంది. నేను ఎంతో ఇష్టపడి చేసిన ప్రాజెక్ట్ ఇది. ఏప్రిల్ 3 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.. ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారో తెలుసుకోవాలనే ఉత్సాహం ఉంది. నేను ఏదైనా సినిమా ఒప్పుకోవాలంటే నాకు ముందుగా పాత్ర నచ్చాలి. అదే సమయంలో కథ కూడా బలంగా ఉండాలి. “బైకర్”లో నా పాత్రతో పాటు కథ కూడా నన్ను ఆకట్టుకుంది. నా పాత్ర పేరు “బుల్లెట్ సునీల్”.
దర్శకుడు అభిలాష్ కి కథ, పాత్రలపై మంచి పట్టుంది. ఒక నటుడి నుంచి రాబట్టుకోవాల్సిన వాటిపై ఆయనకు స్పష్టత ఉంటుంది. ఈ సినిమాలో నన్ను కొత్తగా చూపించడంలో ఆయన విజన్ ఉంది. ఈ సినిమాలో బైక్ రేసింగ్ సన్నివేశాలు చాలా ఉన్నత స్థాయిలో ఉంటాయి. హాలీవుడ్ స్థాయి అనుభూతి ఇస్తాయి. అదే సమయంలో తండ్రి–కొడుకు భావోద్వేగం కూడా బలంగా ఉంటుంది. ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులను తాకుతాయి.
మీకు వ్యక్తిగతంగా బైక్స్ అంటే ఇష్టమా?
చిన్నప్పటి నుంచే బైక్స్‌పై నాకు ఆసక్తి ఉంది. మా అమ్మమ్మ ఇంట్లో బుల్లెట్ బైక్ ఉండేది. సెలవుల్లో అక్కడికి వెళ్లినప్పుడు ఆ బైక్‌పై తిరిగేవాడిని. తర్వాత ఆ ఆసక్తి మరింత పెరిగింది. “శేషు” సినిమా సమయంలో నేను యమహా 650 సీసీ బైక్ కొనుగోలు చేసి షూటింగ్‌లో కూడా వాడాను.
శర్వానంద్‌తో కలిసి పని చేసిన అనుభవం ఎలా ఉంది?
మేము స్నేహితుల్లా కలిసి పని చేశాం. నేను నా పాత్రపై ఎక్కువ దృష్టి పెట్టాను. అతను మంచి నటుడు.
మీ తదుపరి సినిమాలు?
పవన్ సాదినేని దర్శకత్వంలో “మగాడు” సినిమా చేస్తున్నాను. ఇంకా కొంత షూటింగ్ మిగిలి ఉంది. అలాగే రమ్య, శివానితో మరో ప్రాజెక్ట్ చేస్తున్నాను. త్వరలో దాని టైటిల్ ప్రకటిస్తాం.
హీరో నుంచి ముఖ్యమంత్రి కావడం అనేది అసాధారణ విజయం అని అంటున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi). కలలాంటి…
ఒక్క మే నెల తప్ప మార్చి నుంచి జూన్ వరకు వచ్చే ఏడాది సమ్మర్ (Summer 2027)లో ప్రతి నెలా…
టాలీవుడ్ నుంచి మరో మహిళా దర్శకురాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన 'సింగ్…
తమిళ స్టార్ విజయ్ చివరి చిత్రంగా తెరకెక్కిన 'జన నాయకుడు' (తమిళంలో 'జన నాయగన్') ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు…
హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త సస్పెన్స్…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో హడావిడిగా విడుదల తేదీ ప్రకటించి కనీసం రెండు, మూడు సార్లు విడుదల తేదీని వాయిదా వేసే…