ఒకప్పుడు అంటే ముఖ్యంగా కోవిడ్ సమయంలో OTT కంటెంట్ కి చాలా క్రేజ్ ఉండేది. ఆ సమయంలో వెబ్ సిరీస్ లకు చాలా పాపులారిటీ వచ్చింది. దాంతో, పలువురు హీరోలు, హీరోయిన్లు ఓటిటి షోలు, సిరీస్ లు చేశారు. సమంత, తమన్నా, రానా, బాలకృష్ణ, నాగ చైతన్య, శోభిత, కియారా అద్వానీ… ఇలా ఎందరో ఓటిటి కంటెంట్ లో పాల్గొన్నారు.
ఐతే ఇప్పుడు అలాంటి వాటికి క్రేజ్ పోయింది. ఇప్పుడు ఒటిటి వైపు వెళ్లేందుకు పేరున్న స్టార్స్ పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఇలాంటి టైములో తేజ సజ్జా, కిరణ్ అబ్బవరం వంటి యువ హీరోలు తాజాగా ఓటిటి ప్లాట్ ఫార్మ్ కోసం షోలు, వెబ్ సిరీస్ లు ఒప్పుకోవడం, వాటిని పూర్తి చెయ్యడం విచిత్రంగానే అనిపిస్తోంది.
తేజ సజ్జా (Teja Sajja)
‘హనుమాన్’, ‘మిరాయ్’ వంటి బ్లాక్‌బస్టర్‌లతో యువతలో క్రేజ్ సంపాదించుకున్న తేజ తాజాగా ఓటీటీ రంగంలోకి అడుగుపెట్టాడు. ఆమెజాన్ ప్రైమ్ వీడియో కోసం “The Traitors “అనే రియాల్టీ షో తెలుగు వెర్షన్‌ను హోస్ట్ చేస్తున్నాడు తేజ సజ్జా. 20 మంది సెలబ్రిటీలతో తెరకెక్కే ఈ షో.. సౌత్ ఇండియాలోనే అతిపెద్ద ఓటీటీ రియాలిటీ షోగా నిలవనుంది. హీరోగా విజయాలు పొందిన తర్వాత ఇప్పుడు ఓటిటి షో ఒప్పుకోవడం విచిత్రమే.
కిరణ్ అబ్బవరం (KIran Abbavaram)
ఇప్పటికే పది సినిమాల్లో నటించాడు కిరణ్ అబ్బవరం. హిట్లు ఉన్నాయి. ఫ్లాపులు ఉన్నాయి. ఐతే ఇటీవల హీరోగా మళ్ళీ ట్రాక్ లోకి వచ్చాడు. చేతిలో “చెన్నై లవ్ స్టోరీ” అనే మూవీ ఉంది. ఈ హీరో కూడా ఆమెజాన్ కోసం ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాడు. దాని పేరు ‘గువ్వల చెరువు ఘాట్’ (Guvvala Cheruvu Ghat). ఇది త్వరలోనే స్ట్రీమ్ కానుంది.
నాగ చైతన్య (Naga Chaitanya)
ఇక నాగ చైతన్య ఇప్పటికే “దూత” అనే వెబ్ సిరీస్ చేశాడు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ వెబ్ సిరీస్ కి రెండో సీజన్ రానుంది. దానికి ఓకె చెప్పాడు నాగ చైతన్య.
హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త సస్పెన్స్…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో హడావిడిగా విడుదల తేదీ ప్రకటించి కనీసం రెండు, మూడు సార్లు విడుదల తేదీని వాయిదా వేసే…
రామ్ చరణ్ పై తనకున్న అభిమానాన్ని ఇప్పటికే చాటుకున్నాడు అఖిల్ (Akhil Akkineni). తాజాగా ఎన్టీఆర్ తో తన అనుబంధాన్ని…
తమిళనాడు ముఖ్యమంత్రి, కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం 'జన నాయగన్' (Jana Nayagan) రిలీజ్…
పెళ్లయి, బాబుకు తల్లి అయినప్పటికీ, ఇప్పటికీ సన్నజాజి తీగలా మెరిసిపోతోంది కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal). కుర్ర హీరోయిన్లకు ఏమాత్రం…
భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse)కి ఐదు సినిమాల తర్వాత మొదటి విజయం దక్కింది. ఒక్క సినిమా హిట్ కాకపోయినా అనేక…