ఈ సంక్రాంతి 2026 పండగకి మొత్తంగా ఐదు సినిమాలు విడుదల అయ్యాయి. అన్నిట్లోనూ కామెడీనే. కామెడీ బాగా వర్కవుట్ అయిన సినిమాలు బాగా ఆడుతున్నాయి. తక్కువ వర్కవుట్ అయినవి తక్కువగా కలెక్షన్లు పొందుతున్నాయి. ఐతే, ఏ సినిమాలో కూడా మంచి కథ కానీ, మంచి కథనం కానీ లేదు. ఒక్క దర్శకుడు కూడా తమ స్పార్క్ చూపించలేదు. కామెడీ సీన్లు మాత్రమే జనం మాట్లాడుకుంటున్నారు.
సంక్రాంతి పండుగకి బోణి కొట్టిన చిత్రం.. ది రాజా సాబ్. ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమాని రెండో రోజుకే జనం మర్చిపోయారు. ఆ తర్వాత వచ్చిన సినిమాల్లోని కామెడీ గురించే అందరూ చర్చించుకుంటున్నారు.
‘మన శంకర వర ప్రసాద్ గారు’లో మెగాస్టార్ చిరంజీవి చాలా కాలం తర్వాత పూర్తి స్థాయి కామిక్ టైమింగ్ తో అదరగొట్టారు. అందుకే, ఈ సినిమాతో అనిల్ రావిపూడి డైరెక్షన్ కన్నా చిరంజీవి కామెడీకే ఎక్కువ మార్కులు పడుతున్నాయి.
ఇక అనగనగా ఒక రాజు సినిమా గురించి చెప్పక్కర్లేదు… తలాతోకా లేకుండా ఎదో ఒక పంచ్ డైలాగ్ వేసి నవ్వించడమే యాక్టింగ్ అనుకునే నవీన్ పోలిశెట్టి చేసిన మరో సినిమా ఇది. ఇది కూడా ఊహించినట్లుగానే ఆడుతోంది.
రవితేజ గత సినిమాలు అన్నీ దారుణమైన ఫ్లాపులు. దాంతో, రవితేజ సినిమాలకు ఓపెనింగ్స్ రావడం తగ్గిపోయింది. అందుకే రవితేజ రూటు మార్చి మొత్తంగా కామెడీ డామినేట్ చేసే సినిమా చేశారు. అదే “భర్త మహాశయులకు విజ్ఞప్తి”. ఈ సినిమా సెకండాఫ్ కొంచెం గతి తప్పినా ఇందులోనే కామెడీ సీన్లు బాగానే ఉన్నాయి.
ఇక పండుగ వరసలో చివరగా వచ్చిన శర్వానంద్ మూవీ “నారి నారి నడుమ మురారి”లో కూడా కామెడీ సీన్లే మెయిన్ బలం. ముఖ్యంగా నరేష్ ట్రాక్ బాగా హైలెట్ అయింది.
మొత్తంగా ఈ సంక్రాంతి 2026 నవ్వుల బాక్సాఫీస్ గా మారింది. తల నరికే వీరసింహారెడ్డిలు, వాల్తేర్ వీరయ్యలు రాలేదు ఈ సారి.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక యాదగిరిగుట్ట (Yadagiri Gutta) లక్ష్మీనరసింహస్వామి ఆలయ నూతన ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేస్తూ జారీ చేసిన…
'నాగబంధం' (Nagabandham) సినిమాలో నటీనటులు చిన్నవాళ్లు. దర్శకుడు కూడా కొత్త. మొన్నటివరకు అంచనాలు కూడా తక్కువే. ఎప్పుడైతే ట్రయిలర్ రిలీజైందో,…
బాలీవుడ్ నటి నేహా ధూపియా (Neha Dhupia) ఇటీవల ఓ అవార్డు కార్యక్రమంలో పాపరాజీపై అసహనం వ్యక్తం చేశారు. ఫొటోగ్రాఫర్లు…
"యానిమల్" చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన త్రిప్తి దిమ్రి (Tripti Dimri) మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రస్తుతం…
హీరోయిన్ కాయదు లోహర్ (Kayadu Lohar) తన పాఠశాల రోజుల్లో ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని బయటపెట్టింది. పదో తరగతి చదువుతున్న…
హీరో, దర్శకుడు, డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ఇలా అనేక విధాలుగా పాపులర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence). "ముని", కాంచన సినిమాల…