మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోన్న ప్రేమకథాచిత్రం… ‘8 వసంతాలు’. ఈ సినిమాలో అనంతిక సనీల్‌కుమార్ నటించింది. ఆమె ఇంతకుముందు సూపర్ హిట్ “మ్యాడ్” చిత్రంలో నటించింది. ఈ కొత్త సినిమా గురించి ఈ భామ చెప్తున్న విశేషాలు చూద్దాం. ‘8 వసంతాలు’ ఈ నెల 20న విడుదల కానుంది.
ఈ కథంతా మీ చుట్టూనే నడుస్తుందా?
ఈ కథలో అమ్మాయి పాత్ర కీలకం. ఐతే, ఇది పూర్తిగా లేడి ఓరియెంటెడ్ చిత్రం కాదు. ఇతర పాత్రలు కూడా కీలకం. కథలో చాలా లెటర్స్ ఉన్నాయి. యాక్షన్ తో కూడిన లవ్ స్టొరీ చేయాలన్న కోరిక తీరింది. ఇందులో కుదిరాయి. స్క్రిప్ట్ చదివి ఏడ్చేశాను. అంత ఎమోషన్ ఉంది. శుద్ధి యోగ్య అనే అమ్మాయిగా కనిపిస్తాను. ఆమె ఒక రచయిత. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యం కూడా ఉంటుంది.
ఇది చాలా ప్యూర్ లవ్ స్టోరీ. ఒక జీవితాన్ని చూస్తున్న అనుభూతి కలుగుతుంది. అందరూ కనెక్ట్ అవుతారు.
ఈ సినిమా కోసం ఏదైనా శిక్షణ తీసుకున్నారా?
అవును.. కళరి ఫైట్ నేర్చుకున్నాను. అలాగే Wing Chun అనే చైనీస్ ఆర్ట్ ఫామ్ ని కూడా నేర్చుకున్నాను. దాని కోసం మూడు నెలలు అంజి మాస్టర్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాను. దర్శకుడు ఫణీంద్ర గారు నాకు గురువు లాంటి వారు. ఆయన చెప్పింది చేశాను.
మీరు యాక్టర్ కావాలనేది మీ కోరికా?
నిజం చెప్పాలంటే పొలిటీషియన్ అవ్వాలని ఉంది నా కోరిక. అందుకే లా చదువుతున్నాను. అయితే అది ఇప్పుడు కాదు నాకు ఒక 40 ఏళ్ళు వచ్చిన తర్వాత రాజకీయనాయకురాలిగా మారుతాను.
తెలుగులో పెద్దరికం, అమ్మ కొడుకు వంటి సినిమాల్లో నటించిన సుకన్య (Sukanya) ఇప్పుడు వార్తల్లో నిలిచారు. 1990లలో ఆమె పాపులర్…
'పెద్ది' (Peddi) వివాదాన్ని క్యాష్ చేసుకోవాలని చాలామంది హీరోయిన్లు ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తోంది. డింపుల్ హయాతీ నుంచి మొదలుపెడితే, నిత్యామీనన్ వరకు…
వృత్తిగతంగా దేవిశ్రీ ప్రసాద్, తమన్ మధ్య ఉన్న పోటీ గురించి అందరికీ తెలిసిందే. వ్యక్తిగతంగా వీళ్లిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం…
జగపతి బాబు (Jagapathi Babu) హీరోగా ఎంత సక్సెస్ అయ్యారో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా కూడా అంతే…
కంగన రనౌత్ (Kangana Ranaut) మన దేశంలో పనిచేస్తున్న నర్సుల దుస్తులపై విమర్శలు చేసింది. బ్రిటిష్ కాలంలో నర్సులకు ఈ…
ఓవైపు జాన్వి కపూర్ ను అసభ్యంగా చూపించారని, సౌత్ సినిమాలో ఇలాంటివి కామన్ అంటూ ట్రోలింగ్ నడుస్తున్న వేళ.. దక్షిణాది…