దీపిక పదుకోన్ ఇటీవల 25 నుంచి 30 కోట్ల పారితోషికం అడగడం, అలాగే ఆరు గంటలే పని చేస్తానని చెప్పడంతో దర్శకుడు సందీప్ వంగాకి కోపం వచ్చింది. ఆమెని తన సినిమాలో తీసుకోవద్దని భావించి ఆమె స్థానంలో త్రిప్తి డిమ్రికి ఛాన్స్ ఇచ్చాడు. దాంతో పెద్ద వివాదమే జరిగింది.
దీపిక – వంగా మధ్య గొడవ గురించే ఇప్పటికే అందరికీ తెలుసు.
తాజాగా ఈ వివాదంపై ఒక బాలీవుడ్ దర్శకుడు స్పందించాడు. కబీర్ ఖాన్ అనే బాలీవుడ్ డైరెక్టర్ దీపిక డిమాండ్లలో తప్పేమి లేదు అని చెప్పాడు.
“ఆమెకి హీరోలకు సమానంగా స్టార్డమ్ ఉంది. ఆమె పాతిక కోట్లు అడగడంలో తప్పు లేదు. ఇక పెద్ద హీరోలు అందరూ తక్కువ టైం మాత్రమే షూటింగ్ చేస్తారు. షారుక్ ఖాన్ కూడా ఆరు, ఏడు గంటలకన్నా ఎక్కువ పని చెయ్యరు. దీపికకి కూడా అలా అడిగే హక్కు ఉంది,” అని కబీర్ ఖాన్ స్పష్టం చేశారు. “భజ్రంగీ భాయిజాన్” వంటి సినిమా తీసిన కబీర్ ఖాన్ కి ప్రస్తుతం బాలీవుడ్ లో క్రేజ్ లేదు.
అన్నట్లు ఆమెకి 20 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చి మరీ అల్లు అర్జున్ కొత్త సినిమాలో నటింపచేస్తున్నారు. ఆమెకి అంత సీను ఉందని కబీర్ ఖాన్, అట్లీ వంటి వారు చెప్తున్నారు.
విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'నాగబంధం'(Nagabandham)లో నభా నటేష్ (Nabha Natesh) మెయిన్ హీరోయిన్ గా…
సినిమా అవకాశాలు తగ్గినా, తాను అనుకున్న తరహా పాత్రలు రాకపోయినా పర్వాలేదని, తనకంటూ ఒక సంతోషకరమైన వ్యక్తిగత జీవితం ఉందని…
రాజమౌళి (Rajamouli) సినిమా అంటే పాత రికార్డులు బద్దలవ్వాలి. కొత్త రికార్డులు స్టార్ట్ అవ్వాల్సిందే. వచ్చే ఏడాది విడుదల కానున్న…
రామ్ చరణ్ నటించిన "పెద్ది" (Peddi) సినిమా జూన్ 4న విడుదలైంది. 25 రోజుల తర్వాత ఈ సినిమా పూర్తి…
రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా మంచి పొజిషన్ లో ఉన్నాడు. పాపులారిటీ ఉంది. యూత్ లో క్రేజ్ ఉంది.…
వరుసగా సినిమాలు నిర్మిస్తోన్న సితార ఎంటర్ టైన్ మెంట్స్ (Sithara Entertainments) వచ్చే నెల నుంచి నెలకో సినిమా విడుదల…