ఇటీవల లిటిల్‌హార్ట్స్ సినిమాతో హిట్ అందుకోండి శివానీ నగరం (Shivani Nagaram). ఈ అమ్మడు నటించిన మూడో చిత్రం… హే బలవంత్ (Hey Balwanth). సుహాస్ సరసన నటించింది. ఈ భామతో ముచ్చట్లు…
‘హే బలవంత్’గురించి చెప్పండి?
సుహాస్‌తో నాకు ఇది రెండో సినిమా.హీరోయిన్ గా నాకు ఇది మూడోసినిమా. నాపాత్రలో ఇన్నోసెన్స్‌తో పాటు కామెడీ కూడా ఉంటుంది. సినిమా చాలా బాగుంటుంది. తప్పకుండా హిట్ అవుతుందనే నమ్మకం ఉంది. సుదర్శన్, సుహాస్, నాపాత్రలు బాగా నవ్విస్తాయి. ఇక నరేష్, వెన్నెల కిషోర్ క్యారెక్టర్స్ హిలేరియస్‌గా ఉంటాయి. సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ మీకు సర్‌ఫ్రైజ్ ఉంటుంది. బాగా ఎంజాయ్ చేస్తారు. నాకు వచ్చిన కథలో దిబెస్ట్ అనిపించినవి పిక్ చేసుకుంటున్నాను. నా మొదటి సినిమాలో కామెడీలో లేదు. సెకండ్ సినిమాలో ఫుల్ కామెడీ. ఈ సినిమాలో కూడా కామెడీ ఉంది, మంచి కథ ఉంది. కథతో పాటు నా పాత్ర కూడా బాగా నచ్చింది.
మీరు సింగర్ అని విన్నాం?
కూచిపూడి, సంగీతం నేర్చుకున్నాను. లిటిల్ హార్డ్స్‌లో చిన్న హమ్మింగ్ ఉంటుంది. ఆరంభం సినిమాలో ఓ పాట పాడాను. సింగింగ్ అవకాశాలు వస్తే పాడతాను.
సినిమాల్లోకి వెళుతున్నా అన్నప్పుడు మీ ఇంట్లో ఒప్పుకున్నారా?
మా ఇంట్లో వెరీ సపోర్టింగ్. వాళ్లు ఇచ్చిన అవకాశాన్ని మంచి సినిమాలతో ప్రూవ్ చేసుకున్నాను. వాళ్లు కూడా ఎంతొ హ్యపీగా ఉన్నారు.
ఎలాంటి సినిమాలు చేయాలని వుంది?
“లిటిల్‌హార్ట్స్”లో నేను చివరిలో సెలెక్ట్ అయ్యాను. నాకు లక్కీగా మంచి సినిమాలు పడ్డాయి. నాకు 100 సినిమాలు చేయాలని లేదు. చేసినవి ఐదు సినిమాలు అయినా మంచివి చేస్తాను.
స్టార్ హీరోలతో ఆఫర్ వస్తే కథతో సంబంధం లేకుండా ఒప్పుకుంటారా?
సినిమా అంటే సినిమా. నాకు కథ, నా పాత్ర నచ్చితే ఒప్పుకుంటాను. . ఎటువంటి నేపథ్యం లేకుండా వచ్చాను. ఆడియన్స్ ఇచ్చిన వాల్యూను నిలుపుకోవటమే ముఖ్యం.
తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావు అంటారు. మీకు బాగానే వస్తున్నాయి?
ఇప్పుడు తెలుగు అమ్మాయిలకు ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి. చిన్న సినిమాలు కూడా ఆడియన్స్ పెద్ద సినిమాలు చేస్తున్నారు. చాలా మంది వెంట వెంటనే సినిమాలు చేయాకపోతే కనిపించకుండ పోతావు అన్నారు. కానీ నాకు మాత్రం సెలక్టివ్‌గా సినిమాలు చేస్తూ ఈ అమ్మాయి ఎప్పుడూ మంచి సినిమాలే చేస్తుంది అనే మాట అనిపించుకోవాలని ఉంది. చాలా మంది హీరోయిన్‌లు చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తారు. వారి బాటలోనే నేను కూడా పయనిస్తాను.
పర్సనల్‌గా మీకు ఎలాంటి సినిమాలు ఇష్టం?
రొమాంటిక్ కామెడీ సినిమాలంటే చాలా ఇష్టం. మూడ్ అప్‌సెట్‌లో ఉన్న ఇలాంటి ఎంటర్‌టైన్ సినిమాలు చూస్తే మూడ్ సెట్ అవుతుంది.
హీరో, దర్శకుడు, డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ఇలా అనేక విధాలుగా పాపులర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence). "ముని", కాంచన సినిమాల…
మహేష్ బాబు,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'గుంటూరు కారం' (Guntur Kaaram) సినిమా గురించి ఇప్పుడు ప్రత్యేకంగా…
పూజ హెగ్డే (Pooja Hegde)కి ఇప్పుడు లక్ తిరిగినట్టు కనిపిస్తోంది. ఆమెకి హిట్స్ లేవు కానీ వరుసగా అవకాశాలు వస్తూనే…
ఈ రోజు అల్లరి నరేష్ (Allari Naresh) పుట్టిన రోజు. దాంతో, నరేష్ కొత్త సినిమా "రంభ ఊర్వశి మేనక"…
విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'నాగబంధం'(Nagabandham)లో నభా నటేష్ (Nabha Natesh) మెయిన్ హీరోయిన్ గా…
సినిమా అవకాశాలు తగ్గినా, తాను అనుకున్న తరహా పాత్రలు రాకపోయినా పర్వాలేదని, తనకంటూ ఒక సంతోషకరమైన వ్యక్తిగత జీవితం ఉందని…