హీరో ఆది సాయికుమార్ (Aadi Saikumar) ఇటీవల ‘శంభాల’ (Shambala) చిత్రంతో బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకోవడమే కాకుండా, విమర్శకుల ప్రశంసలు కూడా దక్కించుకున్నాడు. ఆ విజయం ఇచ్చిన ఉత్సాహంతో, అదే సక్సెస్ ఫుల్ టీమ్ తో ఆది తన తదుపరి ప్రాజెక్ట్‌ను ప్రకటించాడు.
తన కొత్త సినిమా గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. “శంభాల వంటి హిట్ చిత్రాన్ని అందించిన క్రేజీ టీమ్ తో మళ్ళీ పని చేయడం చాలా సంతోషంగా ఉంది, ఈసారి మేము పూర్తిగా భిన్నమైన, సరికొత్త కాన్సెప్ట్‌తో వస్తున్నాం” అని రాసుకొచ్చాడు.
తన కొత్త చిత్రం గురించి ఆది వివరిస్తూ, కొన్ని కథలు తలుపు తట్టి రావు, అవి నిశ్శబ్దంగా వికసించి మనల్ని వెంటాడుతుంటాయని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. అందం, రక్తం, చీకటితో నిండిన ఒక విభిన్నమైన అనుభూతిని ఈ సినిమా ప్రేక్షకులకు అందిస్తుందని ఆయన హామీ ఇచ్చాడు.
సాధారణంగా హిట్ కాంబినేషన్లను రిపీట్ చేయడం టాలీవుడ్ లో ఒక సెంటిమెంట్. ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, ఆది సాయికుమార్ కూడా ఈ సినిమా ఎనౌన్స్ చేశాడు. శంభాల డైరక్ట్ చేసిన యుగంధర్ ముని ఈ కొత్త సినిమాకు ప్రజెంటర్. షైనింగ్ పిక్చర్స్ నిర్మాతలైన మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభిమోజు నిర్మాతలుగా, బృందా రవీందర్ దర్శకత్వంలో ఈ సినిమా రానుంది.
చిత్రం అనౌన్స్‌మెంట్‌తో పాటు విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఎట్రాక్ట్ చేస్తోంది. ఈ సినిమాకు శ్రీచరణ్ పాకాల సంగీత దర్శకుడు.
హీరో, దర్శకుడు, డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ఇలా అనేక విధాలుగా పాపులర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence). "ముని", కాంచన సినిమాల…
మహేష్ బాబు,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'గుంటూరు కారం' (Guntur Kaaram) సినిమా గురించి ఇప్పుడు ప్రత్యేకంగా…
పూజ హెగ్డే (Pooja Hegde)కి ఇప్పుడు లక్ తిరిగినట్టు కనిపిస్తోంది. ఆమెకి హిట్స్ లేవు కానీ వరుసగా అవకాశాలు వస్తూనే…
ఈ రోజు అల్లరి నరేష్ (Allari Naresh) పుట్టిన రోజు. దాంతో, నరేష్ కొత్త సినిమా "రంభ ఊర్వశి మేనక"…
విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'నాగబంధం'(Nagabandham)లో నభా నటేష్ (Nabha Natesh) మెయిన్ హీరోయిన్ గా…
సినిమా అవకాశాలు తగ్గినా, తాను అనుకున్న తరహా పాత్రలు రాకపోయినా పర్వాలేదని, తనకంటూ ఒక సంతోషకరమైన వ్యక్తిగత జీవితం ఉందని…