న్యూస్

Drishyam 3: తెలుగులో కూడా మోహన్ లాలే!

మోహన్ లాల్ (Mohanlal) నటించిన “దృశ్యం” (Drishyam)మలయాళంలో ఎంత పాపులరో తెలుగులో కూడా అంతే పాపులర్. తెలుగులో వెంకటేష్ రెండు భాగాల్లో నటించారు. ఇప్పుడు ఈ సిరీస్ లో మోహన్ లాల్ హీరోగా మూడో భాగం వస్తోంది. “దృశ్యం 3” (Drishyam 3) ట్రైలర్ తాజాగా విడుదలైంది. మే 21న ఈ సినిమా విడుదల కానుంది.

వెంకటేష్ హీరోగా తెలుగులో కూడా “దృశ్యం 3” వస్తుందా, రాదా? అన్న సందిగ్ధత ముగిసింది. తెలుగులో రీమేక్ కావడం లేదు. తెలుగులో కూడా మోహన్ లాల్ వర్షన్ మాత్రమే విడుదల కానుంది.

హిందీలో “దృశ్యం 3” పేరుతోనే అజయ్ దేవ్గణ్ హీరోగా హీరోగా తెరకెక్కి స్తున్నారు. కానీ తెలుగులో మాత్రం రీమేక్ చెయ్యడం లేదు. ప్రస్తుతం వెంకటేష్ సక్సెస్ ఫుల్ గా హిట్స్ ఇస్తున్నారు. “సంక్రాంతికి వస్తున్నాం” పెద్ద హిట్. చిరంజీవి “మన శంకర్ వర ప్రసాద్”లో కూడా ఒక కీలక పాత్ర చేస్తే అది కూడా హిట్ అయింది. ఇక ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకుడిగా “ఆదర్శ కుటుంబం” సినిమాలో నటిస్తున్నారు. ఆ తర్వాత అనిల్ రావిపూడి డైరెక్షన్ లో మల్టీ స్టారర్ మూవీ చేస్తున్నారు. సో వెంకటేష్ కి ఇప్పుడు ఈ రీమేక్ అవసరం లేదు.

‘దృశ్యం 3’లో మోహన్ లాల్ తో పాటు ఆయన భార్యగా మీనా నటించారు. తెలుగులో కూడా తాజాగా ట్రైలర్ (Drishyam 3 Telugu Trailer) వచ్చింది.

TeluguCinema

Recent Posts

తల్లి కావాలనే కల ఇప్పటిది కాదు: Samantha

నటి సమంత (Samantha) ఇటీవలే తాను గర్భవతి అని వెల్లడించారు. తల్లి కాబోతున్న విషయాన్ని మీడియా ద్వారా, సోషల్ మీడియా…

7 hours ago

Trivikram Srinivas: కోసం బ్రేస్ లెట్ అమ్మిన కమెడియన్

కెరీర్ ప్రారంభంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) పడిన కష్టాలు గురించి కొన్ని మాత్రమే బాహ్య ప్రపంచానికి తెలుసు. మరీ…

7 hours ago

Bhagyashri Borse: కొత్తగా కథలు వింటున్నాను

లెనిన్ (Lenin) తర్వాత భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) తెలుగులో ఏ సినిమా చెయ్యబోతుంది? మొన్నటి వరకు ఆమెని ఐరన్…

8 hours ago

NTR: ‘పొలిటికల్ పుకార్ల’ వలయంలో చిక్కుకున్న డ్రాగన్

ఎన్టీఆర్ కి రాజకీయాలు కొత్త కాదు. 2009లోనే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేశారు. ఐతే, ఆ తర్వాత…

8 hours ago

Naga Durga: ఎన్నో కండీషన్లు, అయినా అవకాశాలు!

తెలుగులో "ఇడుపు కాయితం" (Idupu Kayitham) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది యూట్యూబ్ సంచలనం నాగదుర్గ (Naga Durga).…

12 hours ago

Ram Gopal Varma: నాగ్ మీద ఒట్టు అఖిల్ బెస్ట్

రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఏం మాట్లాడినా, ఏ ట్వీట్ వేసినా అది పీక్స్ లో ఉంటుంది.…

1 day ago