‘విశ్వంభర’ (Vishwambhara) సినిమాపై ప్రస్తుతం క్రేజీ రూమర్ నడుస్తోంది. చిరంజీవి (Chiranjeevi) హీరోగా నటించిన ఈ సినిమాను ఇప్పుడు 2 భాగాలుగా విడుదల చేయబోతున్నారట. ముందుగా పార్ట్-1 వస్తుందంట, ఆ తర్వాత 3 నెలలకు పార్ట్-2 వస్తుందంట.
చాలా విచిత్రమైన రూమర్ ఇది. ఎందుకంటే, ముందు నుంచి ‘విశ్వంభర’ సినిమా సింగిల్ మూవీనే. రేపోమాపో విడుదల తేదీ ప్రకటిస్తారని ఎదురుచూస్తున్న టైమ్ లో, ఇలా సినిమాను 2 భాగాలు చేశారంటూ ప్రచారం మొదలవ్వడం విచిత్రమే. అదే కనుక జరిగితే చిరంజీవి కెరీర్ లో 2 భాగాలుగా రాబోతున్న తొలి చిత్రంగా ‘విశ్వంభర’ నిలిచిపోతుంది.
ఈ పుకార్ల సంగతి పక్కనపెడితే, సింగిల్ మూవీగా తీసిన సినిమాను 2 భాగాలుగా రిలీజ్ చేయడం సాధ్యమా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఒకవేళ అలా చేయాలనుకుంటే కొన్ని అదనపు సన్నివేశాలు తీయాల్సి ఉంటుంది. దానికోసం మరోసారి షూటింగ్ మొదలుపెట్టాల్సి వస్తుంది. ప్రాక్టికల్ గా ఇదంతా సాధ్యమా అనే చర్చ మొదలైందిప్పుడు.
పెద్ద సినిమాలపై పుకార్లు రావడం సహజమే. కానీ ‘విశ్వంభర’పై ఇలాంటి ఊహాగానం చెలరేగడం చాలా అసహజంగా ఉంది. చిరంజీవి హీరోగా నటించిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. వశిష్ఠ దర్శకుడు.
నటి సమంత (Samantha) ఇటీవలే తాను గర్భవతి అని వెల్లడించారు. తల్లి కాబోతున్న విషయాన్ని మీడియా ద్వారా, సోషల్ మీడియా…
కెరీర్ ప్రారంభంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) పడిన కష్టాలు గురించి కొన్ని మాత్రమే బాహ్య ప్రపంచానికి తెలుసు. మరీ…
లెనిన్ (Lenin) తర్వాత భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) తెలుగులో ఏ సినిమా చెయ్యబోతుంది? మొన్నటి వరకు ఆమెని ఐరన్…
ఎన్టీఆర్ కి రాజకీయాలు కొత్త కాదు. 2009లోనే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేశారు. ఐతే, ఆ తర్వాత…
తెలుగులో "ఇడుపు కాయితం" (Idupu Kayitham) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది యూట్యూబ్ సంచలనం నాగదుర్గ (Naga Durga).…
రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఏం మాట్లాడినా, ఏ ట్వీట్ వేసినా అది పీక్స్ లో ఉంటుంది.…