Categories: న్యూస్

ఏప్రిల్ 4న ‘ఆదిత్య 369’ రిలీజ్

నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా రూపొందిన క్లాసిక్ సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘ఆదిత్య 369’ మళ్లీ వెండితెరపై సందడి చేయడానికి సిద్ధంగా ఉంది.

1991లో విడుదలై సంచలన విజయాన్ని సాధించిన ఈ సినిమాను 4K డిజిటలైజేషన్, 5.1 సౌండ్‌తో మరింత అధునాతనంగా మళ్ళీ ప్రేక్షకులకు అందిస్తున్నారు.

“నందమూరి బాలకృష్ణ గారు శ్రీకృష్ణదేవరాయలుగా, కృష్ణ కుమార్‌గా రెండు విభిన్న పాత్రల్లో అద్భుతంగా నటించారు. దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు గారు ఈ సినిమాను తెలుగు చలనచిత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచేలా తీర్చిదిద్దారు. ఇప్పటి టెక్నికల్ హంగులతో మరింత గొప్ప అనుభూతిని అందించేలా రీ రిలీజ్‌కి సిద్ధమైంది,” అని శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణ ప్రసాద్ అన్నారు.

“మంచి థియేటర్లు లభించడంతో, ముందుగా అనుకున్న ఏప్రిల్ 11న కాకుండా ఏప్రిల్ 4వ తేదీనే రీ రిలీజ్ చేయాలని నిర్ణయించాం’’ అని వివరించారు శివలెంక కృష్ణ ప్రసాద్.

Admin

Recent Posts

Prince Cecil: వైవాహిక బంధంలోకి మరో నటుడు

సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఒక్కొక్కరుగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. బ్రహ్మచారి జీవితానికి గుడ్ బై చెప్పేస్తున్నారు. ఇదే బాటలో తాజాగా…

29 minutes ago

Nabha Natesh: రెండు సినిమాలపై ఆశలు, ఒకటి పోయింది

నభా నటేష్ (Nabha Natesh) ఈ ఏడాది రెండు భారీ సినిమాలపై ఆశలు పెట్టుకొంది ఒకటి నాగబంధం (Nagabandham), మరోటి…

9 hours ago

Sri Gouri Priya: తెలుగు భామకి తెలుగులో కెరీర్ ఊపు వచ్చేనా

శ్రీ గౌరీ ప్రియ (Sri Gouri Priya) అచ్చ తెలుగు అమ్మాయి. ఇప్పటికే తెలుగులో 'మ్యాడ్' చిత్రంలో నటించింది. తమిళంలో…

13 hours ago

Rashmika Mandannaకి వీరితో జోడి కుదిరేనా?

తెలుగులో పాన్ ఇండియా స్థాయిలో పాపులారిటీ ఉన్న భామ… రష్మిక మందాన (Rashmika Mandanna) మాత్రమే. బాలీవుడ్ లో  'యానిమల్',…

14 hours ago

Varun Tej ఖాతాలోనే మారుతి తదుపరి చిత్రం

దర్శకుడు మారుతి (Maruthi) ఆ మధ్య తీసిన 'ది రాజా సాబ్' (The Raja Saab) సినిమా ఎంత ఘోరంగా…

14 hours ago

Varanasi: రాజమౌళి మూవీ ఏప్రిల్ 7 నుంచి వాయిదా పడుతుందా?

రాజమౌళి తీస్తున్న భారీ చిత్రం "వారణాసి" (Varanasi)పై అంచనాలు మాములుగా లేవు. విడుదల టైంకి ఇంకా భారీగా ఉంటుంది హైప్.…

2 days ago