Categories: న్యూస్

మాజీ భర్తను గుర్తుచేసుకొంది

హీరోయిన్ అమలాపాల్, జగత్ దేశాయ్ ను పెళ్లాడి ఏడాది అయింది. ఈ సందర్భంగా ఆమె ఓ వీడియో రిలీజ్ చేసింది. అందులో తన మాజీ భర్తను, గత జ్ఞాపకాల్ని ఆమె గుర్తుచేసుకోవడం విశేషం.

“ఎన్నో కలలు సాకారం చేసుకోవాలనుకున్నాను. కానీ జీవన ప్రయాణంలో కొన్నింటిని కోల్పోయాను. అయితే నా జీవితంలో నాకు నచ్చని విధంగా జరిగిన ప్రతిదానికి నేను థ్యాంక్స్ చెబుతున్నాను. ఎందుకంటే, ఆ చేదు అనుభవాల వల్లనే నాకు జగత్ దేశాయ్ లాంటి మంచి మనిషి దొరికాడు. అతడు నా జీవితంలోకి వచ్చిన తర్వాతే నాకో సురక్షితమైన ఇల్లు దొరికినట్టు అనిపించింది.”

ఇకపై తను ఒంటరిని కాదని.. జగత్ ను చూసుకుంటే అద్దంలో తననుతాను చూసుకుంటున్నట్టు ఉంటుందని అంటోంది అమలా పాల్. జీవితంలో ఇప్పుడు తనున్న బెస్ట్ పార్ట్ కు పాత చేదు అనుభవాలే కారణమంటోంది.

ఇలా పరోక్షంగా అమలాపాల్ తన గత జీవితం, తన మాజీ భర్త, దర్శకుడు ఏఎల్ విజయ్‌ ను గుర్తు చేసుకుంది.

2014 లో అమలాపాల్, విజయ్ పెళ్లి చేసుకున్నారు. మనస్పర్థలు రావ‌డంతో 2017లో విడాకులు తీసుకున్నారు. అలా కొన్నాళ్లు ఒంటరిగానే ఉన్న అమలాపాల్.. గతేడాది నవంబర్ 5న జగత్ దేశాయ్‌ని పెళ్లి చేసుకుంది. ఏడాది తిరక్కముందే బిడ్డకు జన్మనిచ్చింది.

Admin

Recent Posts

Tripti Dimri: ‘స్పిరిట్’ భామ ఖాతాలో ఇంకో ఘనత

"యానిమల్" చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన త్రిప్తి దిమ్రి (Tripti Dimri) మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రస్తుతం…

48 minutes ago

Kayadu Lohar: రాయితో బుర్ర పగలగొట్టిన హీరోయిన్

హీరోయిన్ కాయదు లోహర్ (Kayadu Lohar) తన పాఠశాల రోజుల్లో ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని బయటపెట్టింది. పదో తరగతి చదువుతున్న…

1 hour ago

Raghava Lawrence: రాజకీయాలకు ఎస్, ఉప ఎన్నికకు నో

హీరో, దర్శకుడు, డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ఇలా అనేక విధాలుగా పాపులర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence). "ముని", కాంచన సినిమాల…

19 hours ago

Kurchi Madathapetti: త్వరలోనే వంద కోట్ల మైలురాయి!

మహేష్ బాబు,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'గుంటూరు కారం' (Guntur Kaaram) సినిమా గురించి ఇప్పుడు ప్రత్యేకంగా…

22 hours ago

Pooja Hegde: పూజ పేరు ఇంకో భారీ ప్రాజెక్టులో!

పూజ హెగ్డే (Pooja Hegde)కి ఇప్పుడు లక్ తిరిగినట్టు కనిపిస్తోంది. ఆమెకి హిట్స్ లేవు కానీ వరుసగా అవకాశాలు వస్తూనే…

1 day ago

Alcohol: మర్చిపోయిన మూవీని గుర్తు చేశారు

ఈ రోజు అల్లరి నరేష్ (Allari Naresh) పుట్టిన రోజు. దాంతో, నరేష్ కొత్త సినిమా "రంభ ఊర్వశి మేనక"…

1 day ago