మొన్నటివరకు పోర్చుగల్ లో భారీ షెడ్యూల్స్ చేసి హైదరాబాద్ వచ్చింది “పైసా వసూల్” యూనిట్. షూటింగ్ దాదాపు కంప్లీట్ అయిపోయింది. కాబట్టి కొన్ని రోజులు రెస్ట్ తీసుకొని మిగతా షూటింగ్ కొనసాగిస్తారని అంతా భావించారు. కానీ బాలయ్య మాత్రం గ్యాప్ ఇవ్వలేదు. అవును.. “పైసా వసూల్” కొత్త షెడ్యూల్ అప్పుడే ప్రారంభమైంది.
పైసావసూల్.. బాలయ్య నటిస్తున్న 101వ చిత్రం. పూరి జగన్నాథ్ దర్శకుడు. శ్రియా, ముస్కాన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
అన్నపూర్ణ స్టుడియోలో వేసిన ఓ సెట్ లో ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ మొదలైంది. దర్శకుడు పూరి జగన్నాథ్ సాంగ్ షూటింగ్ ప్రారంభించాడు. మరో 3,4 రోజుల పాటు ఈ పాట షూటింగ్ ఉంటుంది. తర్వాత మరో 5 రోజుల పాటు యాక్షన్ పార్ట్ చిత్రీకరిస్తారు. దీంతో ప్యాచ్ వర్క్ మినహా సినిమా దాదాపు కంప్లీట్ అయిపోతుందట.
ఆగస్ట్ చివరినాటికి ఫస్ట్ కాపీ సిద్ధం చేయాలని అనుకుంటున్నాడు దర్శకుడు పూరి జగన్నాథ్. సినిమాను దసరా కానుకగా సెప్టెంబర్ 29న విడుదల చేయాలని నిర్ణయించారు. బాలయ్య సినిమాకు దసరాతో పాటు లాంగ్ వీకెండ్ కూడా కలిసొచ్చింది. సెప్టెంబర్ 30 దసరా పడింది. అక్టోబర్ 1 ఆదివారం, తర్వాత అక్టోబర్ 2 సోమవారం నాడు గాంధీ జయంతి పడింది.
రాజమౌళి తీస్తున్న భారీ చిత్రం "వారణాసి" (Varanasi)పై అంచనాలు మాములుగా లేవు. విడుదల టైంకి ఇంకా భారీగా ఉంటుంది హైప్.…
నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) వరుస సినిమాలను ప్రకటిస్తూ టాలీవుడ్‌లో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. గతంలో తనకు 'వీరసింహారెడ్డి'…
ప్రభాస్ (Prabhas) ఒకేసారి రెండు, మూడు చిత్రాలను సెట్స్ పై ఉంచుతాడు. 'బాహుబలి 2' విడుదల తర్వాత ఇలా చేస్తూ…
నటి శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) తన పారితోషికాన్ని తగ్గించాలన్న నిర్మాతల మాటకి నో చెప్పిందట. రెమ్యునరేషన్ విషయంలో తగ్గేదే…
బాలీవుడ్‌కు వెళ్లిన తర్వాత తెలుగు సినీ పరిశ్రమపై విమర్శలు చేసిన హీరోయిన్లలో తాప్సీ, తమన్నా కన్పిస్తారు.. తెలుగు సినిమాల ద్వారానే…
అక్కినేని కోడలు శోభిత (Sobhita) లేటెస్ట్ స్టేట్ మెంట్ ఇది. వినడానికి కాస్త ఆశ్చర్యంగా, షాకింగ్ గా అనిపించినప్పటికీ…దీని వెనక…