క‌త్తి రెడ్డిగా బ్ర‌హ్మి!

ఒక‌పుడు బ్ర‌హ్మి లేని తెలుగు సినిమా విడుద‌ల‌య్యేది కాదు. ఇపుడు బ్ర‌హ్మి ఉన్న మూవీ ఏది అని అడిగితే మీ బుర్ర‌కి బాగా ప‌ని పెట్టాలి. ఒడ‌లు బ‌ళ్లు అవుతాయి అన‌డానికి బ్ర‌హ్మి ప‌ర్‌ఫెక్ట్ ఎగ్జాంపుల్‌. ఏడాది గ్యాప్‌లోనే ఆయ‌న ఫేట్ మొత్తం మారింది.

కొంత‌కాలంగా గ్రాండ్ కిడ్స్‌తోనే ఇంట్లో కాల‌క్షేపం చేస్తున్నాడు. అఫ్‌కోర్స్ కోట్ల‌ల్లో సంపాదించాడు. ప‌ని లేద‌నే బాధ త‌ప్ప మ‌నీ లేద‌న్న చింత లేదు. అయితే ఆయ‌న‌కి మ‌ళ్లీ కొంత ప‌ని క‌ల్పించే సినిమా ఒక‌టి ద‌క్కింది. బ్ర‌హ్మికి మ‌ళ్లీ ఒక సినిమాలో కీ రోల్ పోషించే చాన్స్ వ‌చ్చింది.

బ్రహ్మానందం లీడ్ రోల్ లో న‌టించ‌నున్న కొత్త సినిమా..”కత్తి రెడ్డి”. “ఎత్తితే .. దించడు” అనేది ట్యాగ్ లైన్. బ్రహ్మానందం లీడ్ రోల్ పోషించే ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి రానుంద‌ట‌. వి రవివర్మ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో మ‌చ్చ ర‌వి ఒక ప్ర‌ధాన పాత్ర‌లో కనిపిస్తాడు. ఇత‌ర వివ‌రాలు తెలియాలి. 

మ‌రి ఈ సినిమాతో అయినా ఖాన్‌దాదాకి ఫేట్ మారుతుందా?

TeluguCinema

Recent Posts

Varanasi: రాజమౌళి మూవీ ఏప్రిల్ 7 నుంచి వాయిదా పడుతుందా?

రాజమౌళి తీస్తున్న భారీ చిత్రం "వారణాసి" (Varanasi)పై అంచనాలు మాములుగా లేవు. విడుదల టైంకి ఇంకా భారీగా ఉంటుంది హైప్.…

1 day ago

Nandamuri Balakrishna: విలక్షణమైన కాంబో మళ్లీ కలుస్తోందా?

నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) వరుస సినిమాలను ప్రకటిస్తూ టాలీవుడ్‌లో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. గతంలో తనకు 'వీరసింహారెడ్డి'…

1 day ago

Prabhas: మూడేళ్ళ తర్వాత ఒకే ఏడాది రెండు చిత్రాలు

ప్రభాస్ (Prabhas) ఒకేసారి రెండు, మూడు చిత్రాలను సెట్స్ పై ఉంచుతాడు. 'బాహుబలి 2' విడుదల తర్వాత ఇలా చేస్తూ…

1 day ago

Srinidhi Shetty: నిర్మాతల కోరికని మన్నించని అందాల నిధి

నటి శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) తన పారితోషికాన్ని తగ్గించాలన్న నిర్మాతల మాటకి నో చెప్పిందట. రెమ్యునరేషన్ విషయంలో తగ్గేదే…

1 day ago

తెలుగు ఇండస్ట్రీలో చాలా మంచి ఉంది: Rakul Preet Singh

బాలీవుడ్‌కు వెళ్లిన తర్వాత తెలుగు సినీ పరిశ్రమపై విమర్శలు చేసిన హీరోయిన్లలో తాప్సీ, తమన్నా కన్పిస్తారు.. తెలుగు సినిమాల ద్వారానే…

1 day ago

అక్కినేని అప్రూవల్ నాకు అక్కర్లేదు: Sobhita

అక్కినేని కోడలు శోభిత (Sobhita) లేటెస్ట్ స్టేట్ మెంట్ ఇది. వినడానికి కాస్త ఆశ్చర్యంగా, షాకింగ్ గా అనిపించినప్పటికీ…దీని వెనక…

3 days ago