Categories: న్యూస్

పబ్బు గొడవ: కల్పికపై కేసు నమోదు

నటి కల్పిక గణేష్ పై కేసు నమోదు అయింది. గత నెలలో ఒక పబ్బులో ఆమె గొడవ చేసింది. ఆ తర్వాత గొడవ గురించి ఆమె మీడియాలో, సోషల్ మీడియాలో రచ్చ చేసింది. ఇంటర్వ్యూలు ఇచ్చింది. పబ్ యాజమాన్యం తనతో తప్పుగా ప్రవర్తించారని ఆరోపణలు చేసింది. ఇప్పుడు ఆ పబ్ యాజమాన్యం ఆమెపై కేసు వేసింది. పబ్‌లో ఆస్తికి నష్టం కలిగించారనే ఆరోపణలతో నటి కల్పికా గణేష్‌పై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.

ఆ నటి తమ సిబ్బందిపై అసభ్యకరమైన భాషను ఉపయోగించిందని, అత్యాచారం, లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తప్పుడు ఆరోపణలు కూడా చేసిందని యాజమాన్యం ఆరోపించింది. మే 29న గచ్చిబౌలిలోని ప్రిజం పబ్ లో ఈ గొడవ జరిగింది. అయితే పబ్ జనరల్ మేనేజర్ దీపక్ బజాజ్ ఫిర్యాదు మేరకు జూన్ 10న FIR నమోదు చేశారు.

“నటి కల్పిక, ఆమె మిత్రుడు కలిసి 2,200 రూపాయల బిల్లు చేశారు. తర్వాత చీజ్‌కేక్ కాంప్లిమెంటరీగా ఇవ్వాలని ఆమె పట్టుబట్టింది. మా సిబ్బంది ఆమెకి బ్రౌనీని ఇచ్చారు. కానీ ఆమె చీజ్ కేకు కావాలంటూ గొడవ చేసింది. బ్రౌనీ ప్లేట్‌ను విసిరేసి హంగామా చేసింది. మేనేజర్లను బూతులు తిట్టింది,” ఫిర్యాదులో దీపక్ బజాజ్ పేర్కొన్నారు.

గొడవ జరిగిన తర్వాత ఇన్ స్టాగ్రామ్ లో తప్పుడు ఆరోపణలు చేసింది అని కూడా ఫిర్యాదులో పేర్కొంది పబ్ యాజమాన్యం. తనని మానసికంగా, మాటలతో పబ్ సిబ్బంది రేప్ చేశారని కల్పిక ఒక ఇంటర్వ్యూలో పేర్కొంది.

ALSO READ: ఇదివరకు తాగేదాన్ని: కల్పిక

మొత్తమ్మీద, ఒక కేకు కోసం, అదీ కూడా ఫ్రీ కేకు కోసం ఇంత గొడవ జరిగింది. చేసిన బిల్లు 2200. ఇప్పుడు వేలల్లో అటు పబ్బుకి, ఇటు కల్పిక లాయర్ల ఫీజ్ ద్వారా నష్టం.

Admin

Recent Posts

Tripti Dimri: ‘స్పిరిట్’ భామ ఖాతాలో ఇంకో ఘనత

"యానిమల్" చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన త్రిప్తి దిమ్రి (Tripti Dimri) మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రస్తుతం…

1 hour ago

Kayadu Lohar: రాయితో బుర్ర పగలగొట్టిన హీరోయిన్

హీరోయిన్ కాయదు లోహర్ (Kayadu Lohar) తన పాఠశాల రోజుల్లో ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని బయటపెట్టింది. పదో తరగతి చదువుతున్న…

2 hours ago

Raghava Lawrence: రాజకీయాలకు ఎస్, ఉప ఎన్నికకు నో

హీరో, దర్శకుడు, డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ఇలా అనేక విధాలుగా పాపులర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence). "ముని", కాంచన సినిమాల…

19 hours ago

Kurchi Madathapetti: త్వరలోనే వంద కోట్ల మైలురాయి!

మహేష్ బాబు,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'గుంటూరు కారం' (Guntur Kaaram) సినిమా గురించి ఇప్పుడు ప్రత్యేకంగా…

23 hours ago

Pooja Hegde: పూజ పేరు ఇంకో భారీ ప్రాజెక్టులో!

పూజ హెగ్డే (Pooja Hegde)కి ఇప్పుడు లక్ తిరిగినట్టు కనిపిస్తోంది. ఆమెకి హిట్స్ లేవు కానీ వరుసగా అవకాశాలు వస్తూనే…

1 day ago

Alcohol: మర్చిపోయిన మూవీని గుర్తు చేశారు

ఈ రోజు అల్లరి నరేష్ (Allari Naresh) పుట్టిన రోజు. దాంతో, నరేష్ కొత్త సినిమా "రంభ ఊర్వశి మేనక"…

1 day ago