Categories: అవీ ఇవీ

అల్లు తాత అమ్మాయిలను ఫాలో అవుతాడట!

చాలామంది సెలెబ్రిటీలు సోషల్ మీడియాలో ఒకటి అధికారిక ఐడి, ఇంకోటి దొంగ ఐడి వాడుతారు. అధికారిక ఐడి నుంచి మిగతావారిని పెద్దగా ఫాలో అవ్వరు. కానీ ఈ డూప్లికేట్ ఐడితో తమకు నచ్చిన సెలెబ్రిటీలను ఫాలో అవుతుంటారు. ముఖ్యంగా ఇన్ స్టాగ్రామ్ లో ఈ ట్రెండ్ ఎక్కువ. అల్లు అర్జున్ కి బన్నీబాయ్ పేరుతో ఒక ప్రైవేట్ ఇన్ స్టాగ్రామ్ ఐడి ఉందట.

అల్లు అర్జున్ కే కాదు ఆయన తండ్రి అల్లు అరవింద్ కి కూడా దొంగ ఐడి ఉందట. ఈ ఐడితో ఆయన అమ్మాయిలను ఫాలో అవుతుంటాడట. అవును… ఈ విషయాన్ని ఆయనే చెప్పారు.

76 ఏళ్ల అల్లు అరవింద్ తాత నిహారిక (Niharika Nm) అనే సోషల్ మీడియా సెలెబ్రిటీని డూప్లికేట్ ఐడితో ఫాలో అవుతున్నాడట. ఈ విషయాన్ని ఆయన ఈ రోజు బయటపెట్టారు. ఈ విషయం చెప్తున్నాడు నిహారిక నమ్మలేకపోతున్నట్లుగా ఫేస్ పెట్టారు. “ఈ వయసులో ఈయన నన్ను ఎందుకు ఫాలో అవుతున్నాడు అన్నట్లుగా నిహారిక ఫేస్ పెట్టింది చూడండి,” అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పడుతున్నాయి.

ఐతే, అల్లు అరవింద్ తనకి ఈ ఫేక్ ఐడీ ఎందుకు ఉందో చెప్పారు. “మన సొంత ఐడితో ఉంటే ఆ జనం పెట్టె కామెంట్లు చూడలేం, చదవలేం. అందుకే, ఇలా. ఇందులో తప్పులేదు,” అని అల్లు తాత తెలిపారు.

నిహారిక అనే ఈ సోషల్ మీడియా సెలెబ్రిటీ తెలుగులో “మిత్ర మండలి” అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాని అల్లు అరవింద్ టీంకి చెందిన బన్నీ వాసు సమర్పిస్తున్నారు. ఈ సినిమా టీజర్ ఈ రోజు విడుదలైంది. అందుకే, అరవింద్ ఈ ఈవెంట్ కి వచ్చి ఈ విషయం చెప్పారు.

“ముసలోడు కానీ మహానుభావుడు ” అంటూ అరవింద్ చేసిన కామెంట్స్ కి ట్రోలింగ్ బ్యాచ్ ఈమోజీలు పెడుతున్నారు.

Admin

Recent Posts

Kayadu Lohar: రాయితో బుర్ర పగలగొట్టిన హీరోయిన్

హీరోయిన్ కాయదు లోహర్ (Kayadu Lohar) తన పాఠశాల రోజుల్లో ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని బయటపెట్టింది. పదో తరగతి చదువుతున్న…

15 minutes ago

Raghava Lawrence: రాజకీయాలకు ఎస్, ఉప ఎన్నికకు నో

హీరో, దర్శకుడు, డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ఇలా అనేక విధాలుగా పాపులర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence). "ముని", కాంచన సినిమాల…

18 hours ago

Kurchi Madathapetti: త్వరలోనే వంద కోట్ల మైలురాయి!

మహేష్ బాబు,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'గుంటూరు కారం' (Guntur Kaaram) సినిమా గురించి ఇప్పుడు ప్రత్యేకంగా…

21 hours ago

Pooja Hegde: పూజ పేరు ఇంకో భారీ ప్రాజెక్టులో!

పూజ హెగ్డే (Pooja Hegde)కి ఇప్పుడు లక్ తిరిగినట్టు కనిపిస్తోంది. ఆమెకి హిట్స్ లేవు కానీ వరుసగా అవకాశాలు వస్తూనే…

24 hours ago

Alcohol: మర్చిపోయిన మూవీని గుర్తు చేశారు

ఈ రోజు అల్లరి నరేష్ (Allari Naresh) పుట్టిన రోజు. దాంతో, నరేష్ కొత్త సినిమా "రంభ ఊర్వశి మేనక"…

1 day ago

నాగబంధంలో స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను: Nabha Natesh

విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'నాగబంధం'(Nagabandham)లో నభా నటేష్ (Nabha Natesh) మెయిన్ హీరోయిన్ గా…

2 days ago