కొన్ని సినిమాలు కొందర్ని అలా గుచ్చుతూనే ఉంటాయి. ఆ గాయాలు మినిమం గ్యాప్స్ లో రగులుతూనే ఉంటాయి. ఎవరేం చేయలేరు, ఆ సినిమాలు చేసిన డ్యామేజీలు అలాంటివి. ఉదాహరణకు ‘ఆదిపురుష్’ సినిమానే తీసుకుంటే, అదొచ్చి ఇన్నేళ్లయినా దర్శకుడు ఓం రౌత్ ను అది వెంటాడుతూనే ఉంది. ఇప్పుడు హరీశ్ శంకర్ విషయంలో కూడా అలాంటి ఓ సినిమా పుట్టుకొచ్చింది. అదే ‘మిస్టర్ బచ్చన్’.
రవితేజ హీరోగా హరీశ్ తీసిన తాజా చిత్రం ఇది. ఇది రీమేక్ అయినప్పటికీ తనదైన శైలిలో మార్పుచేర్పులు చేసి ప్రేక్షకులకు అందించాడు. అయితే సినిమా ఏమాత్రం ఆకట్టుకోలేదు సరికదా, ఈ ఏడాది బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ఒకటిగా నిలిచిపోయింది.
తన కెరీర్ లో రవితేజ ఎన్నో డిజాస్టర్లు చూశాడు కానీ, ‘మిస్టర్ బచ్చన్’ డిజాస్టర్ మాత్రం ఎపిక్ అంటారు మాస్ రాజా ఫ్యాన్స్. ఈ సినిమా విషయంలో హరీశ్ పై జరిగిన ట్రోలింగ్ అంతాఇంతా కాదు. ఎప్పటికప్పుడు ఆయన వాటిని తిప్పికొడుతూనే ఉన్నాడు, అలసిపోయి లేదా విసిగిపోయి ఇక స్పందించడం మానేశాడు.
అలా అంతా అయిపోయిందనుకున్న టైమ్ లో పాతగాయాన్ని మళ్లీ రేపాడు రానా. ఓ అవార్డ్ ఫంక్షన్ లో యాంకరింగ్ చేస్తూ.. ఈ ఏడాది అమితాబ్ బచ్చన్ కెరీర్ లో ‘హై’ చూశారు, అలాగే ‘లో’ కూడా చూశారంటూ కామెంట్ చేశాడు.
రానా దృష్టిలో ‘హై’ అంటే కల్కి, ‘లో’ అంటే మిస్టర్ బచ్చన్ అని అర్థం. దీనిపై కొంతమంది అసహనం వ్యక్తం చేస్తూ నేరుగా హరీశ్ నే ట్యాగ్ చేశారు.
“ఎన్నో విన్నాను.. అందులో ఇదోటి, అన్ని రోజూలు ఒకేలా ఉండవు, నాకైనా, ఎవరికైనా.. ” అంటూ స్పందించాడు హరీశ్. అతడి బాధ, ఆవేదన ఆ పోస్టులో స్పష్టంగా కనిపించింది.
"యానిమల్" చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన త్రిప్తి దిమ్రి (Tripti Dimri) మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రస్తుతం…
హీరోయిన్ కాయదు లోహర్ (Kayadu Lohar) తన పాఠశాల రోజుల్లో ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని బయటపెట్టింది. పదో తరగతి చదువుతున్న…
హీరో, దర్శకుడు, డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ఇలా అనేక విధాలుగా పాపులర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence). "ముని", కాంచన సినిమాల…
మహేష్ బాబు,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'గుంటూరు కారం' (Guntur Kaaram) సినిమా గురించి ఇప్పుడు ప్రత్యేకంగా…
పూజ హెగ్డే (Pooja Hegde)కి ఇప్పుడు లక్ తిరిగినట్టు కనిపిస్తోంది. ఆమెకి హిట్స్ లేవు కానీ వరుసగా అవకాశాలు వస్తూనే…
ఈ రోజు అల్లరి నరేష్ (Allari Naresh) పుట్టిన రోజు. దాంతో, నరేష్ కొత్త సినిమా "రంభ ఊర్వశి మేనక"…