గాయని సుచిత్ర తాజా ఇంటర్వ్యూ మీడియాకి ఎంతో పని కల్పించింది. ఆమె “కుముదం” అనే పత్రికకు ఇచ్చిన వీడియో ఇంటర్వ్యూలో ధనుష్, ధనుష్ మాజీ భార్య, త్రిష, సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్, ఇంకా పలువురు తమిళ సెలెబ్రిటీల గురించి మాట్లాడింది. అలాగే తన మాజీ భర్త, నటుడు కార్తీక్ కుమార్ హోమో సెక్స్ వల్ అని పేర్కొంది.
“నా భర్త గే అన్న విషయం పెళ్ళైన కొన్నాళ్లకే అర్థమైంది. ధనుష్, నా భర్త కార్తీక్ కుమార్, ఇంకా తొట్టి గ్యాంగ్ తెల్లార్లూ పార్టీ చేసుకునేవారు. ధనుష్ తోనే ఉండేవాడు కార్తీక్ కుమార్. ఒక గేతో ధనుష్ కి ఏమి పని?,” అని బాంబు పేల్చింది సుచిత్ర.
ధనుష్, ధనుష్ మాజీ భార్య ఐశ్వర్య ఇంకా ఈ ఇంటర్వ్యూ గురించి స్పందించలేదు. ఐతే, ఆమె మాజీ భర్త కార్తీక్ కుమార్ తాజాగా ఒక వీడియో ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు.
“నేను నిజంగా హోమ్ సెక్స్ వల్ ని అయి ఉంటే నేను దాన్ని దాచుకోను. స్వలింగ సంపర్కుల ర్యాలీలో ఆనందంగా పాల్గొనేవాడిని,” అంటూ ఆమె ఆరోపణలను కార్తీక్ కుమార్ తోసిపుచ్చారు.
కార్తీక్ కుమార్, సుచిత్ర విడిపోయి చాలా కాలమే అయింది. ఇప్పుడు ఆమె మరో వ్యక్తిని పెళ్లాడింది.
రాజమౌళి తీస్తున్న భారీ చిత్రం "వారణాసి" (Varanasi)పై అంచనాలు మాములుగా లేవు. విడుదల టైంకి ఇంకా భారీగా ఉంటుంది హైప్.…
నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) వరుస సినిమాలను ప్రకటిస్తూ టాలీవుడ్‌లో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. గతంలో తనకు 'వీరసింహారెడ్డి'…
ప్రభాస్ (Prabhas) ఒకేసారి రెండు, మూడు చిత్రాలను సెట్స్ పై ఉంచుతాడు. 'బాహుబలి 2' విడుదల తర్వాత ఇలా చేస్తూ…
నటి శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) తన పారితోషికాన్ని తగ్గించాలన్న నిర్మాతల మాటకి నో చెప్పిందట. రెమ్యునరేషన్ విషయంలో తగ్గేదే…
బాలీవుడ్‌కు వెళ్లిన తర్వాత తెలుగు సినీ పరిశ్రమపై విమర్శలు చేసిన హీరోయిన్లలో తాప్సీ, తమన్నా కన్పిస్తారు.. తెలుగు సినిమాల ద్వారానే…
అక్కినేని కోడలు శోభిత (Sobhita) లేటెస్ట్ స్టేట్ మెంట్ ఇది. వినడానికి కాస్త ఆశ్చర్యంగా, షాకింగ్ గా అనిపించినప్పటికీ…దీని వెనక…