న్యూస్

MAA: మా పేరిట మోసాలు!

తెలుగు రాష్ట్రాల్లోని చలనచిత్ర కళాకారులకు ప్రాతినిధ్యం వహించే ఏకైక అధికారిక సంస్థ తమదిమాత్రమేనని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) స్పష్టం చేసింది. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌తో అనుబంధం కలిగి ఉన్న ఏకైక అసోసియేషన్ ఇదేనని, పరిశ్రమలోని 24 క్రాఫ్ట్‌లతో సమన్వయం చేసుకుంటూ కళాకారుల సంక్షేమం కోసం పని చేస్తున్నామని పేర్కొంది ‘మా’.

ఈమధ్య “AP MAA”, “MAA AP” వంటి పేర్లతో కొన్ని అనధికారిక సంస్థలు పుట్టుకొచ్చినట్లు ‘మా’ దృష్టికి వచ్చింది. ఈ నకిలీ సంస్థలు అసలైన ‘మా’ పేరును వాడుకుంటూ కళాకారులను, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని, ‘మా’ ఆందోళన వ్యక్తం చేసింది.

ముఖ్యంగా, ఈ అనధికారిక వ్యక్తులు కళాకారుల నుండి సభ్యత్వాల పేరుతో చట్టవిరుద్ధంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు ‘మా’ కు సమాచారం అందింది. తాము ఎవరికీ ఇలాంటి వసూళ్ల కోసం అనుమతి ఇవ్వలేదని, తమ పేరును వాడుకుని ఇలాంటి మోసాలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది ‘మా’.

కళాకారులు, పరిశ్రమ సభ్యులు ఇలాంటి మోసపూరిత సంస్థల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వారికి ఎలాంటి రుసుము చెల్లించవద్దని ‘మా’ విజ్ఞప్తి చేసింది. ఏదైనా డౌట్ ఉంటే హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్‌లో ఉన్న ‘మా’ కార్యాలయాన్ని నేరుగా సంప్రదించండి అంటున్నారు. 

TeluguCinema

Recent Posts

Sonakshi Sinha: అవకాశాలు తగ్గినా పర్లేదు!

సినిమా అవకాశాలు తగ్గినా, తాను అనుకున్న తరహా పాత్రలు రాకపోయినా పర్వాలేదని, తనకంటూ ఒక సంతోషకరమైన వ్యక్తిగత జీవితం ఉందని…

2 hours ago

Varanasi: ఓవర్సీస్ రేట్లు మరీ ఓవర్ గా ఉన్నాయట

రాజమౌళి (Rajamouli) సినిమా అంటే పాత రికార్డులు బద్దలవ్వాలి. కొత్త రికార్డులు స్టార్ట్ అవ్వాల్సిందే. వచ్చే ఏడాది విడుదల కానున్న…

4 hours ago

Peddi: మిగతా అన్ని భాషల్లోనూ అట్టర్ ఫ్లాప్

రామ్ చరణ్ నటించిన "పెద్ది" (Peddi) సినిమా జూన్ 4న విడుదలైంది. 25 రోజుల తర్వాత ఈ సినిమా పూర్తి…

4 hours ago

Ram Pothineni: ఈ రోజు నుంచి మొదలుపెట్టాడు

రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా మంచి పొజిషన్ లో ఉన్నాడు. పాపులారిటీ ఉంది. యూత్ లో క్రేజ్ ఉంది.…

4 hours ago

Sithara: జులై నుంచి అక్టోబర్, వరుసగా నాలుగు చిత్రాలు

వరుసగా సినిమాలు నిర్మిస్తోన్న సితార ఎంటర్ టైన్ మెంట్స్ (Sithara Entertainments) వచ్చే నెల నుంచి నెలకో సినిమా విడుదల…

19 hours ago

Bloody Romeo: నాని సినిమా ఆగలేదు, మొదలు ఎప్పుడంటే

ఒక వైపు "ఓజీ 2" (OG 2) సినిమా హడావిడి జరుగుతోంది. రోజుకో ఆప్డేట్ ఇస్తోంది టీం. దాంతో అందరిలో…

22 hours ago