సోషల్ మీడియాలో నాగబాబు చాలా యాక్టివ్. మరీ ముఖ్యంగా యూట్యూబ్ లో ఆయన పెట్టే వీడియోలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతుంటాయి. కొన్ని రాజకీయ దుమారం రేపిన సందర్భాలు కూడా ఉన్నాయి. “అంతా నా ఇష్టం” అంటూ నాగబాబు చేసే హడావుడి పొలిటికల్ సర్కిల్ లో చాలామందికి తెలిసిందే. అలాంటి నాగబాబు ఈసారి “కుక్కకు విశ్వాసం లేదు” అంటూ ఓ వీడియో రిలీజ్ చేశారు.
నాగబాబు ఈ వీడియో రిలీజ్ చేసిన వెంటనే చాలామంది దాన్ని కూడా పొలిటికల్ యాంగిల్ లో చూశారు. ఈసారి నాగబాబు ఎవరిపై సెటైర్ వేశారా అనే ఆసక్తితో చాలామంది ఆసాంతం చూశారు. అయితే ఈసారి నాగబాబు ఎలాంటి పేరడీలు చేయలేదు. సెటైర్లు వేయలేదు. తన పెంపుడు కుక్కకు నిజంగానే విశ్వాసం లేదంటూ ఓ ఫన్నీ వీడియో పెట్టారంతే.
2016 నుంచి పీకూ అనే కుక్కను పెంచుకుంటున్నారు నాగబాబు. ఎవరైనా తన మీదకు వస్తే, తనకు ప్రమాదం జరుగుతుందని అనిపిస్తే.. ఆ కుక్క తన ప్రాణాలకు తెగించి పోరాడుతుందని ఇన్నాళ్లూ నాగబాబు అనుకున్నారట. అయితే ఈమధ్య ఓసారి రబ్బరు పాముతో భార్య భయాన్ని పోగొట్టేందుకు నాగబాబు ప్రయత్నించగా.. అతడ్ని వదిలేసి ఈ కుక్క కూడా లోపలకు పరుగులు తీసింది. అందుకే తన కుక్కకు విశ్వాసం లేదని, మనుషుల బుద్ధులు వచ్చేశాయని చమత్కరిస్తున్నారు నాగబాబు.
విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'నాగబంధం'(Nagabandham)లో నభా నటేష్ (Nabha Natesh) మెయిన్ హీరోయిన్ గా…
సినిమా అవకాశాలు తగ్గినా, తాను అనుకున్న తరహా పాత్రలు రాకపోయినా పర్వాలేదని, తనకంటూ ఒక సంతోషకరమైన వ్యక్తిగత జీవితం ఉందని…
రాజమౌళి (Rajamouli) సినిమా అంటే పాత రికార్డులు బద్దలవ్వాలి. కొత్త రికార్డులు స్టార్ట్ అవ్వాల్సిందే. వచ్చే ఏడాది విడుదల కానున్న…
రామ్ చరణ్ నటించిన "పెద్ది" (Peddi) సినిమా జూన్ 4న విడుదలైంది. 25 రోజుల తర్వాత ఈ సినిమా పూర్తి…
రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా మంచి పొజిషన్ లో ఉన్నాడు. పాపులారిటీ ఉంది. యూత్ లో క్రేజ్ ఉంది.…
వరుసగా సినిమాలు నిర్మిస్తోన్న సితార ఎంటర్ టైన్ మెంట్స్ (Sithara Entertainments) వచ్చే నెల నుంచి నెలకో సినిమా విడుదల…