పెళ్లికి సరిగ్గా కొన్ని రోజుల ముందు ఓ టాక్ షోలో పాల్గొన్నాడు నాగచైతన్య. రానా దగ్గుబాటి హోస్ట్ చేస్తున్న షో అది. అందులో తన ఫ్యూచర్ లైఫ్, పిల్లలపై స్పందించాడు.
వెంకీ మామలా అంతమంది పిల్లలు కాకుండా.. ఇద్దరు పిల్లలు తనకు చాలని అంటున్నాడు నాగచైతన్య. ఆ ఇద్దర్లో ఒకరు అమ్మాయి, మరొకరు అబ్బాయైతే ఇంకా బెటర్ అని చెబుతున్నాడు.
కొడుకు పుడితే అతడ్ని కార్ రేసులకు తీసుకెళ్తాడట. కొడుకుతో కలిసి గోకార్టింగ్ ఆడతాడట. అదే కూతురు పుడితే ఆమె హాబీలేంటో తెలుసుకుంటాడట. అవే హాబీల్ని తను కూడా అనుసరిస్తాడట. మ్యాగ్జిమమ్ టైమ్ కూతురుతో గడుపుతాడంట.
ALSO READ: A few pics from Naga Chaitanya and Sobhita’s wedding album
ఇక జీవితంపై పూర్తి క్లారిటీతో ఉన్నాడు నాగచైతన్య. ఎప్పుడైతే మనం ప్రతి రోజూ ఆనందంగా ఉంటామో, అప్పుడే జీవితంలో విజయం సాధించినట్టు లెక్క అని చెబుతున్నాడు. అలా సంతోషంగా ఉండగలిగితే ఈ జీవితానికి అంతకంటే ఇంకేం కావాలని అంటున్నాడు.
కూల్ గా, రిజర్వ్ డ్ గా ఉండే నాగచైతన్య.. ఏదైనా సినిమా పార్టీలో చొక్కా తీసి గాల్లో ఎగరేసి ఎంజాయ్ చేసే సందర్భం ఉందా? ఈ ప్రశ్నకు సూటిగా స్పందించాడు చైతూ. త్వరలోనే ఆ మూమెంట్ చూస్తారని అంటున్నాడు. ‘తండేల్’ సినిమా పెద్ద హిట్టవుతుందనేది చైతూ నమ్మకం.
విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'నాగబంధం'(Nagabandham)లో నభా నటేష్ (Nabha Natesh) మెయిన్ హీరోయిన్ గా…
సినిమా అవకాశాలు తగ్గినా, తాను అనుకున్న తరహా పాత్రలు రాకపోయినా పర్వాలేదని, తనకంటూ ఒక సంతోషకరమైన వ్యక్తిగత జీవితం ఉందని…
రాజమౌళి (Rajamouli) సినిమా అంటే పాత రికార్డులు బద్దలవ్వాలి. కొత్త రికార్డులు స్టార్ట్ అవ్వాల్సిందే. వచ్చే ఏడాది విడుదల కానున్న…
రామ్ చరణ్ నటించిన "పెద్ది" (Peddi) సినిమా జూన్ 4న విడుదలైంది. 25 రోజుల తర్వాత ఈ సినిమా పూర్తి…
రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా మంచి పొజిషన్ లో ఉన్నాడు. పాపులారిటీ ఉంది. యూత్ లో క్రేజ్ ఉంది.…
వరుసగా సినిమాలు నిర్మిస్తోన్న సితార ఎంటర్ టైన్ మెంట్స్ (Sithara Entertainments) వచ్చే నెల నుంచి నెలకో సినిమా విడుదల…