న్యూస్

Nikhil Siddhartha: బర్త్ డే వచ్చింది, డేట్ రాలేదు

నిఖిల్ సిద్ధార్థ్ (Nikhil Siddharth) ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. సాధారణంగా హీరోల పుట్టిన రోజు నాడు కొత్త సినిమా ప్రకటన కానీ, కొత్త టీజర్ కానీ, విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాకి సంబంధించి రిలీజ్ డేట్ ప్రకటించడం కానీ చేస్తుంటారు. కానీ ఈ సారి నిఖిల్ సిద్ధార్థ విషయంలో అలా ఏమి జరగలేదు.

ఈ రోజు కూడా అతని సినిమా స్వయంభు (Swayambhu) విడుదల విషయంలో ఎలాంటి క్లారిటీ రాలేదు. ఈ సినిమాని నిజానికి గత ఏడాదే విడుదల చేయాలనుకున్నారు. ఆ తర్వాత ఫిబ్రవరి 2026 అని చెప్పారు. కొన్నాళ్ళకు ఏప్రిల్ 10 అని అన్నారు. తర్వాత నిరవధికంగా వాయిదా వేసిన విషయం మనకు తెలుసు. కానీసం పుట్టిన రోజు నాడు అయినా రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ ఇస్తారని చూస్తే అదీ లేదు.

విజువల్ ఎఫెక్ట్స్ వల్ల సినిమా ఆలస్యం అవుతోంది అని టీం చెప్తోంది. ఈ రోజు బర్త్ డే ని పురస్కరించుకొని ఒక పోస్టర్ మాత్రం విడుదల చేశారు. నిఖిల్ సిద్ధార్థ రథానికి చెందిన చక్రాన్ని పైకి లేపిన యుద్ధ సన్నివేశంలోని స్టిల్ ఇది.

ఈ సినిమాలో నిఖిల్ ఒక యోధుడిగా కనిపిస్తాడు. ఈ సినిమా విజయం అతనికి కీలకం. పైగా ఇది పాన్ ఇండియా మార్కెట్ ని దృష్టిలో పెట్టుకొని తీస్తున్నారు.

TeluguCinema

Recent Posts

Bhagyashri Borse: ఒక్క విజయం 2 కోట్ల భాగ్యం

భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse)కి ఐదు సినిమాల తర్వాత మొదటి విజయం దక్కింది. ఒక్క సినిమా హిట్ కాకపోయినా అనేక…

8 hours ago

Prince Cecil: వైవాహిక బంధంలోకి మరో నటుడు

సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఒక్కొక్కరుగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. బ్రహ్మచారి జీవితానికి గుడ్ బై చెప్పేస్తున్నారు. ఇదే బాటలో తాజాగా…

8 hours ago

Nabha Natesh: రెండు సినిమాలపై ఆశలు, ఒకటి పోయింది

నభా నటేష్ (Nabha Natesh) ఈ ఏడాది రెండు భారీ సినిమాలపై ఆశలు పెట్టుకొంది ఒకటి నాగబంధం (Nagabandham), మరోటి…

16 hours ago

Sri Gouri Priya: తెలుగు భామకి తెలుగులో కెరీర్ ఊపు వచ్చేనా

శ్రీ గౌరీ ప్రియ (Sri Gouri Priya) అచ్చ తెలుగు అమ్మాయి. ఇప్పటికే తెలుగులో 'మ్యాడ్' చిత్రంలో నటించింది. తమిళంలో…

21 hours ago

Rashmika Mandannaకి వీరితో జోడి కుదిరేనా?

తెలుగులో పాన్ ఇండియా స్థాయిలో పాపులారిటీ ఉన్న భామ… రష్మిక మందాన (Rashmika Mandanna) మాత్రమే. బాలీవుడ్ లో  'యానిమల్',…

22 hours ago

Varun Tej ఖాతాలోనే మారుతి తదుపరి చిత్రం

దర్శకుడు మారుతి (Maruthi) ఆ మధ్య తీసిన 'ది రాజా సాబ్' (The Raja Saab) సినిమా ఎంత ఘోరంగా…

22 hours ago