అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూసిన ఎన్టీఆర్ (NTR) పుట్టినరోజు వచ్చేసింది. అతడ్ని చూసి, వీలైతే కలసి, ఇంకా కుదిరితే ఓ షేక్ హ్యాండ్ ఇచ్చి, పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలని చాలామంది డైహార్డ్ ఫ్యాన్స్ ప్రయత్నించారు. ఎన్టీఆర్ ఇంటికి అభిమానులు పోటెత్తారు.
ఎన్టీఆర్ కోసం ఫ్యాన్స్ వస్తారని తెలుసు. అందుకే అతడి నివాసం వద్ద ముందుగానే సెక్యూరిటీ ఏర్పాట్లు చేశారు. బారికేడ్లు ఏర్పాటుచేశారు. సమయం రానే వచ్చింది, ఎన్టీఆర్ బయటకొచ్చాడు. చేయి ఊపుతూ అందరికీ అభివాదం చేశాడు. ఫ్యాన్స్ పొంగిపోయారు. తమ మొబైల్స్ కు పనిచెప్పారు.
మరికొందరు బారికేడ్ తోసుకొని ఎన్టీఆర్ ను తాకే ప్రయత్నం చేశారు. షేక్ హ్యాండ్ ఇవ్వడం కోసమే వాళ్ల తాపత్రయం. కానీ ఎన్టీఆర్ భద్రతా సిబ్బంది అత్యుత్సాహం చూపించారు. బారికేడ్లతో ఫ్యాన్స్ ను నెట్టే ప్రయత్నం చేశారు. మరికొందరిపై మేన్ హ్యాండ్లింగ్ కూడా చేశారు.
అక్కడే ఉన్న ఎన్టీఆర్ ఇదంతా చూసి తట్టుకోలేకపోయాడు. సెక్యూరిటీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. వెనక్కు వెళ్లు అంటూ కళ్లు పెద్దవి చేసి సెక్యూరిటీ సిబ్బందిని హెచ్చరించాడు.
‘నీ వల్లే ఈ గందరగోళం అంతా’ అంటూ కోప్పడ్డాడు. ఆ తర్వాత తన దగ్గరకు దూసుకొచ్చిన ఇద్దరు ముగ్గురు అభిమానులకు షేక్ హ్యాండ్ కూడా ఇచ్చాడు. అలా తన పుట్టినరోజు నాడు అభిమానులకు దర్శనం కల్పించాడు ఎన్టీఆర్.
విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'నాగబంధం'(Nagabandham)లో నభా నటేష్ (Nabha Natesh) మెయిన్ హీరోయిన్ గా…
సినిమా అవకాశాలు తగ్గినా, తాను అనుకున్న తరహా పాత్రలు రాకపోయినా పర్వాలేదని, తనకంటూ ఒక సంతోషకరమైన వ్యక్తిగత జీవితం ఉందని…
రాజమౌళి (Rajamouli) సినిమా అంటే పాత రికార్డులు బద్దలవ్వాలి. కొత్త రికార్డులు స్టార్ట్ అవ్వాల్సిందే. వచ్చే ఏడాది విడుదల కానున్న…
రామ్ చరణ్ నటించిన "పెద్ది" (Peddi) సినిమా జూన్ 4న విడుదలైంది. 25 రోజుల తర్వాత ఈ సినిమా పూర్తి…
రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా మంచి పొజిషన్ లో ఉన్నాడు. పాపులారిటీ ఉంది. యూత్ లో క్రేజ్ ఉంది.…
వరుసగా సినిమాలు నిర్మిస్తోన్న సితార ఎంటర్ టైన్ మెంట్స్ (Sithara Entertainments) వచ్చే నెల నుంచి నెలకో సినిమా విడుదల…