హీరోలను పెళ్లి గురించి అడిగితే తప్పించుకుంటారు. హీరోయిన్లను పెళ్లి గురించి అడిగితే ప్రేమించి పెళ్లి చేసుకుంటాం అంటారు. అదే పెద్దవాళ్లను అడిగితే ఇంట్లో చూసిన సంబంధం చేసుకోమని చెబుతారు. ఇప్పుడు అలీ (Ali) కూడా అదే చెబుతున్నారు.
ఓ ఈవెంట్లో మాట్లాడిన అలీ, ప్రేమ పెళ్లిళ్ల కంటే ఇంట్లో చూసిన సంబంధమే బెటర్ అంటున్నారు. పిల్లలకు ఏదిష్టమో, ఏది మంచిదో తల్లిదండ్రుల కంటే ఎవరికి బాగా తెలుస్తుందని ప్రశ్నిస్తున్నారు అలీ. చిన్నప్పట్నుంచి పిల్లల్ని చూస్తూ, పెంచుతూ, పోషిస్తున్న తల్లిదండ్రులకు.. ఆ అబ్బాయి లేదా అమ్మాయికి ఎలాంటి సంబంధం చూడాలో తెలియదా అని ప్రశ్నిస్తున్నారు.
తల్లిదండ్రులు ఎప్పుడూ పిల్లలకు మంచి సంబంధాలే చూస్తారని, పెళ్లి గురించి యూత్ ఆలోచించకుండా తమ కెరీర్ పై దృష్టి పెట్టాలంటున్నారు. పెళ్లి విషయాన్ని పెద్దలు చూసుకుంటారని అంటున్నారు. ఆయన మాట్లాడుతుంటే, పక్కనే భార్య జుబేదా కూడా ఉన్నారు. అలీ మాట్లాడుతుంటే అవునన్నట్టు సీరియస్ గా తలూపారు.
అయితే అలీ చెప్పినదానికి పూర్తి భిన్నంగా ఉంది బయట పరిస్థితి. ముందు ఫ్రెండ్స్ అంటున్నారు. ఆ తర్వాత డేటింగ్ అంటున్నారు. ఆ తర్వాత లివ్-ఇన్ అంటున్నారు. అప్పటికీ భాగస్వామిని విడిచిపెట్టలేమనిపిస్తే పెళ్లి చేసుకుంటున్నారు.
"యానిమల్" చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన త్రిప్తి దిమ్రి (Tripti Dimri) మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రస్తుతం…
హీరోయిన్ కాయదు లోహర్ (Kayadu Lohar) తన పాఠశాల రోజుల్లో ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని బయటపెట్టింది. పదో తరగతి చదువుతున్న…
హీరో, దర్శకుడు, డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ఇలా అనేక విధాలుగా పాపులర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence). "ముని", కాంచన సినిమాల…
మహేష్ బాబు,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'గుంటూరు కారం' (Guntur Kaaram) సినిమా గురించి ఇప్పుడు ప్రత్యేకంగా…
పూజ హెగ్డే (Pooja Hegde)కి ఇప్పుడు లక్ తిరిగినట్టు కనిపిస్తోంది. ఆమెకి హిట్స్ లేవు కానీ వరుసగా అవకాశాలు వస్తూనే…
ఈ రోజు అల్లరి నరేష్ (Allari Naresh) పుట్టిన రోజు. దాంతో, నరేష్ కొత్త సినిమా "రంభ ఊర్వశి మేనక"…