అవికా గోర్ (Avika Gor) థాయ్ లాండ్ షిఫ్ట్ అయిన సంగతి తెలిసిందే. ఆమె భర్త బ్యాంకాంక్ లో పనిచేస్తాడు. అతడి కెరీర్ కోసం అవికా ఇండియా వదిలేసి థాయ్ వెళ్లిపోయింది. అక్కడ ఈ దంపతులు ఓ ఇల్లు కూడా కొనుక్కున్నారు. త్వరలోనే ఆ ఇంటిని అందరికీ చూపిస్తానని, వీడియో కూడా రెడీ అయిందని చెబుతోంది అవికా.
కొనుక్కున్న ఇంటిలో ఇంటీరియర్ వర్క్ నడుస్తోంది. అందుకే ప్రస్తుతానికి అవికా దంపతులు ఓ అపార్ట్ మెంట్ లో ఉంటున్నారు. త్వరలోనే కొత్త ఇంట్లోకి షిఫ్ట్ అవుతారు. ఆ వెంటనే యూట్యూబ్ లో వీడియో అప్ లోడ్ చేస్తానంటోంది అవికా.
అగోడా అనే ట్రావెల్ ఏజెన్సీలో చాలా పెద్ద పొజిషన్ లో పనిచేస్తున్నాడు అవికా భర్త. ఆ రంగంలో మరింత ఎత్తుకు ఎదగాలంటే ఇండియా కంటే బ్యాంకాక్ లో ఉండడం అవసరం. ఇదే అంశంపై భార్యాభర్తలిద్దరూ చర్చించుకున్నారు. అలా భర్త కెరీర్ కోసం అవికా ఇండియా వదిలేసింది.
అయితే సినిమాల కోసం బ్యాంకాక్ నుంచి ఇండియాకు వస్తానంటోంది అవికా. వారం అంతా ఇండస్ట్రీకి అందుబాటులో ఉంటానని, వీకెండ్ బ్యాంకాక్ వెళ్తానని చెబుతోంది. ఈమె ప్లానింగ్ బాగానే ఉంది కానీ ఎంతమంది ప్రొడ్యూసర్లు ఈమె ప్లానింగ్ కు ఓకే చెబుతారో చూడాలి.
"యానిమల్" చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన త్రిప్తి దిమ్రి (Tripti Dimri) మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రస్తుతం…
హీరోయిన్ కాయదు లోహర్ (Kayadu Lohar) తన పాఠశాల రోజుల్లో ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని బయటపెట్టింది. పదో తరగతి చదువుతున్న…
హీరో, దర్శకుడు, డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ఇలా అనేక విధాలుగా పాపులర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence). "ముని", కాంచన సినిమాల…
మహేష్ బాబు,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'గుంటూరు కారం' (Guntur Kaaram) సినిమా గురించి ఇప్పుడు ప్రత్యేకంగా…
పూజ హెగ్డే (Pooja Hegde)కి ఇప్పుడు లక్ తిరిగినట్టు కనిపిస్తోంది. ఆమెకి హిట్స్ లేవు కానీ వరుసగా అవకాశాలు వస్తూనే…
ఈ రోజు అల్లరి నరేష్ (Allari Naresh) పుట్టిన రోజు. దాంతో, నరేష్ కొత్త సినిమా "రంభ ఊర్వశి మేనక"…