పెళ్లి వంటి ఒకప్పుడు బ్లాక్ బస్టర్ చిత్రాలు ఇచ్చిన వడ్డే నవీన్ (Vadde Naveen) మళ్ళీ హీరోగా రీ ఎంట్రీ ఇస్తున్నారు. వడ్డే నవీన్ హీరోగా, నిర్మాతగా రూపొందించిన తాజా చిత్రం ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ (Transfer Trimurthulu)
కమల్ తేజ నార్ల ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. ఈ సినిమాలో వడ్డే నవీన్, రాశి సింగ్ జంటగా నటించారు. శిల్పా తులస్కర్, వివేక్ రఘువంశీ, రఘుబాబు, శివన్నారాయణ, వడ్లమాని శ్రీనివాస్, జ్వాలా కోటి, దేవి ప్రసాద్, సూర్య, బాబా బాస్కర్, ప్రమోదిని, సాథ్విక్ రాజు, అంజలి ప్రియ, గాయత్రి చాగంటి తదితరులు ముఖ్య పాత్రల్ని పోషించారు.
ఈ మూవీని జూన్ 19న విడుదల చేయనున్నారు. గురువారం నాడు మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు.
“మా నాన్న గారు చనిపోయిన తరువాత నేను నటిస్తున్న, నిర్మిస్తున్న మొదటి చిత్రమిది. నేను ఎప్పుడూ హైదరాబాద్‌లోనే ఉన్నాను. ఫ్యామిలీతోనే ఉంటున్నాను. నేను ఎక్కువగా బయట కనిపించను. కానీ నా గురించి మీడియా, అభిమానులు మాత్రం ఎప్పుడూ గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. అందుకు థాంక్స్. బ్రేక్ తీసుకున్నాను, వచ్చింది. నా వద్దకు వచ్చిన కథలు నచ్చలేదు, నచ్చిన కథలు నా వద్దకు రాలేదు. ఎన్నో కథలు విన్నాను. త్రిమూర్తులు పాత్ర గురించి మాత్రమే కమల్ చెప్పాడు. ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ అనే టైటిల్ కూడా చెప్పాడు. అయితే కథ, స్క్రిప్ట్ మీద ఏడాది పాటు ఇద్దరం వర్క్ చేశాం. కథ మొత్తం రెడీ అయ్యాక షూటింగ్‌కి వెళ్లాం. హై క్వాలిటీ స్టాండర్డ్‌లో ఉంటుంది. కంటెంట్ కూడా కొత్తగా ఉంటుంది.” అని అన్నారు నవీన్.
ప్రీతి ముకుందన్ (Preity Mukhundhan) ... తెలుగులో ఆమె మొదటి సినిమా 'కన్నప్ప'. అలాగే ఆమె నటించిన 'బ్లాస్ట్' (Blast)…
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక యాదగిరిగుట్ట (Yadagiri Gutta) లక్ష్మీనరసింహస్వామి ఆలయ నూతన ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేస్తూ జారీ చేసిన…
'నాగబంధం' (Nagabandham) సినిమాలో నటీనటులు చిన్నవాళ్లు. దర్శకుడు కూడా కొత్త. మొన్నటివరకు అంచనాలు కూడా తక్కువే. ఎప్పుడైతే ట్రయిలర్ రిలీజైందో,…
బాలీవుడ్ నటి నేహా ధూపియా (Neha Dhupia) ఇటీవల ఓ అవార్డు కార్యక్రమంలో పాపరాజీపై అసహనం వ్యక్తం చేశారు. ఫొటోగ్రాఫర్లు…
"యానిమల్" చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన త్రిప్తి దిమ్రి (Tripti Dimri) మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రస్తుతం…
హీరోయిన్ కాయదు లోహర్ (Kayadu Lohar) తన పాఠశాల రోజుల్లో ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని బయటపెట్టింది. పదో తరగతి చదువుతున్న…