తమిళనాట విజయ్ (Vijay) ముఖ్యమంత్రిగా అవతరించిన వెంటనే పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పై విమర్శలు చెలరేగాయి.
విజయ్ తరహాలో పవన్ కల్యాణ్ కూడా వ్యవహరించినట్టయితే ఈపాటికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయి ఉండేవారని, పొత్తులు పెట్టుకొని పార్టీని పల్చన చేసుకున్నారంటూ ఆయనకు స్వయంగా మెసేజీలు పెట్టిన వాళ్లు కూడా ఉన్నారు. వీటిపై పవన్ సూటిగా స్పందించారు.
తమిళనాడు రాజకీయ పరిస్థితులు, ఏపీ రాజకీయ పరిస్థితులు పూర్తి భిన్నం అన్నారు పవన్ కల్యాణ్. అక్కడ విజయ్ గెలిచాడని, ఇక్కడ తను గెలవలేదని అనుకోవడం కరెక్ట్ కాదన్నారు. పోనీ ఈ వాదనలే నిజం అనుకుంటే, 2019లో ఒంటరిగా పోటీ చేసినప్పుడు రెండు చోట్లా ఓడించారని ఆవేదన వ్యక్తం చేశారు పవన్.
తను ఓడిపోవడం మాట అటుంచి, తన వెంట ఉన్న నాయకులు కూడా జారుకున్నారని బాధపడ్డారు పవన్ కల్యాణ్. ఇప్పటికైనా తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తో తనను కంపార్ చేయడం మానుకోవాలని సూచించారు. అయినా తను పార్టీ పెట్టింది సీఎం అవ్వడం కోసం కాదని, సమాజంలో మార్పు కోసం పార్టీ పెట్టానని అన్నారు పవన్.
సర్జరీ నుంచి కోలుకున్న తర్వాత ఇప్పుడిప్పుడే ఆయన రాజకీయ కార్యక్రమాలతో బిజీ అవుతున్నారు. ఈ క్రమంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న పవన్, ఇన్ని రోజులుగా తనపై వచ్చిన విమర్శలకు ఇలా చెక్ పెట్టారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక యాదగిరిగుట్ట (Yadagiri Gutta) లక్ష్మీనరసింహస్వామి ఆలయ నూతన ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేస్తూ జారీ చేసిన…
'నాగబంధం' (Nagabandham) సినిమాలో నటీనటులు చిన్నవాళ్లు. దర్శకుడు కూడా కొత్త. మొన్నటివరకు అంచనాలు కూడా తక్కువే. ఎప్పుడైతే ట్రయిలర్ రిలీజైందో,…
బాలీవుడ్ నటి నేహా ధూపియా (Neha Dhupia) ఇటీవల ఓ అవార్డు కార్యక్రమంలో పాపరాజీపై అసహనం వ్యక్తం చేశారు. ఫొటోగ్రాఫర్లు…
"యానిమల్" చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన త్రిప్తి దిమ్రి (Tripti Dimri) మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రస్తుతం…
హీరోయిన్ కాయదు లోహర్ (Kayadu Lohar) తన పాఠశాల రోజుల్లో ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని బయటపెట్టింది. పదో తరగతి చదువుతున్న…
హీరో, దర్శకుడు, డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ఇలా అనేక విధాలుగా పాపులర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence). "ముని", కాంచన సినిమాల…