ఇప్పుడంతా డిజిటల్ యుగం. కెమెరా ఏదైనా, లెన్స్ ఎన్ని మార్చినా లోపల ఉండేది చిప్. నచ్చినంత రికార్డు చేయడం, నచ్చకపోతే డిలీట్ చేయడం చాలా కామన్. అందుకే ఇప్పటితరం మేకర్స్ కు ఫిలిం విలువ తెలియదు. కానీ బుచ్చిబాబుకు మాత్రం తెలిసొచ్చింది. ‘పెద్ది’ (Peddi) సినిమాలో కీలకమైన ఢిల్లీ ఎపిసోడ్ ఉంది.
దాన్ని డిజిటల్ లో కాకుండా ఫిలింలో తీయాలని నిర్ణయించుకున్నారు. ఆ సన్నివేశాల్ని ఫిలింలో తీస్తేనే బాగుంటుందని అంతా కలిసి నిర్ణయించుకొని, ముంబయి నుంచి ఫిలిం తెప్పించారు. ఒక్కసారి రోల్ అయిన తర్వాత వెంటనే యాక్షన్ చెప్పాలి. లేదంటే ఫిలిం వృధా అయిపోతుంది.
బుచ్చిబాబు మాత్రం రోల్ అని చెప్పిన తర్వాత చాలా టైమ్ తీసుకునేవాడంట. దీంతో చాలా ఫిలిం వృధా అయిందని, అప్పట్లో మేకర్స్ ఎంత కష్టపడ్డారో, ఎంత టైమ్ సెన్స్ పాటించేవారో తనకు అర్థమైందన్నాడు బుచ్చి.
‘పెద్ది’ సినిమాలో ఢిల్లీ ఎపిసోడ్ ను ఫిలిం రోల్ తో ఎందుకు షూట్ చేయాల్సి వచ్చిందో చెప్పడం కష్టమంటున్నాడు బుచ్చిబాబు. దాన్ని తెరపై చూస్తే ఆ అనుభూతి వేరేలా ఉంటుందంటున్నాడు.
నటి సమంత (Samantha) ఇటీవలే తాను గర్భవతి అని వెల్లడించారు. తల్లి కాబోతున్న విషయాన్ని మీడియా ద్వారా, సోషల్ మీడియా…
కెరీర్ ప్రారంభంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) పడిన కష్టాలు గురించి కొన్ని మాత్రమే బాహ్య ప్రపంచానికి తెలుసు. మరీ…
లెనిన్ (Lenin) తర్వాత భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) తెలుగులో ఏ సినిమా చెయ్యబోతుంది? మొన్నటి వరకు ఆమెని ఐరన్…
ఎన్టీఆర్ కి రాజకీయాలు కొత్త కాదు. 2009లోనే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేశారు. ఐతే, ఆ తర్వాత…
తెలుగులో "ఇడుపు కాయితం" (Idupu Kayitham) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది యూట్యూబ్ సంచలనం నాగదుర్గ (Naga Durga).…
రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఏం మాట్లాడినా, ఏ ట్వీట్ వేసినా అది పీక్స్ లో ఉంటుంది.…