‘హిట్ 3’ సినిమాలో నాని సరసన హీరోయిన్ గా నటించింది శ్రీనిధి శెట్టి. ‘కేజీఎఫ్-2’ హిట్టయిన తర్వాత తెలుగు నుంచి ఆమెకు చాలానే అవకాశాలొచ్చాయి. కానీ ఆమె మాత్రం సెలక్టివ్ గా వెళ్లింది. అందులో ‘హిట్-3’ కూడా ఒకటి.
ఈ సినిమానే ఎంచుకోవడం వెనక ప్రత్యేక కారణాన్ని బయటపెట్టింది శ్రీనిధి శెట్టి. ఈ సినిమా ఆఫర్ రాగానే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఓకే చెప్పిందట. దానికి కారణం హీరో నాని అంటోంది.
నాని అంటే ఇండస్ట్రీలో ఓ బ్రాండ్ అంటోంది శ్రీనిధి. అతడి సినిమాల్లో హీరోయిన్ పాత్రలకు కూడా మంచి వెయిట్ ఉంటుందని, ఆ విషయం తనకు తెలుసు కాబట్టే మరో ఆలోచన లేకుండా ‘హిట్-3’ కి ఓకే చెప్పానని అంటోంది.
మే 1న ఈ సినిమా థియేటర్లలోకి రాబోతోంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఈ ఆసక్తికర విషయాన్ని ఆమె వెల్లడించింది. సినిమా టీజర్, ట్రయిలర్ లో తను పెద్దగా కనిపించలేదని, కానీ సినిమాలో తన పాత్రకు మంచి వెయిట్ ఉందని చెబుతోంది శ్రీనిధి.
విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'నాగబంధం'(Nagabandham)లో నభా నటేష్ (Nabha Natesh) మెయిన్ హీరోయిన్ గా…
సినిమా అవకాశాలు తగ్గినా, తాను అనుకున్న తరహా పాత్రలు రాకపోయినా పర్వాలేదని, తనకంటూ ఒక సంతోషకరమైన వ్యక్తిగత జీవితం ఉందని…
రాజమౌళి (Rajamouli) సినిమా అంటే పాత రికార్డులు బద్దలవ్వాలి. కొత్త రికార్డులు స్టార్ట్ అవ్వాల్సిందే. వచ్చే ఏడాది విడుదల కానున్న…
రామ్ చరణ్ నటించిన "పెద్ది" (Peddi) సినిమా జూన్ 4న విడుదలైంది. 25 రోజుల తర్వాత ఈ సినిమా పూర్తి…
రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా మంచి పొజిషన్ లో ఉన్నాడు. పాపులారిటీ ఉంది. యూత్ లో క్రేజ్ ఉంది.…
వరుసగా సినిమాలు నిర్మిస్తోన్న సితార ఎంటర్ టైన్ మెంట్స్ (Sithara Entertainments) వచ్చే నెల నుంచి నెలకో సినిమా విడుదల…