ఇటీవల ఎక్కడ చూసినా త్రిష (Trisha) పేరే వినిపిస్తోంది. ఆమె బాగా లైంలైట్ లోకి వచ్చింది హీరో విజయ్ ముఖ్యమంత్రి కావడంతో. విజయ్, త్రిష మధ్య ఉన్న బంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఐతే, ఆమె తాజాగా ఒక పెద్ద సినిమా నుంచి తప్పుకోబోతుంది అనే టాక్ నడుస్తోంది.
రజినీకాంత్ – కమల్ హాసన్ (Rajinikanth – Kamal Haasan) కాంబినేషన్‌లో తెరకెక్కబోయే భారీ మల్టీస్టారర్ లో త్రిష హీరోయిన్‌గా నటించనుందని, ఇందుకోసం ఆమెకు భారీ రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేశారనే ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు కోలీవుడ్‌లో కొత్త టాక్ వినిపిస్తోంది. త్రిష ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకునే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ చిత్ర నిర్మాణంలో భాగమైన రెడ్ జయింట్ (Red Giant) Movies సంస్థ మాజీ సీఎం స్టాలిన్ కుటుంబానికి చెందినదిగా తెలిసిందే. ప్రస్తుత తమిళనాడు రాజకీయ పరిస్థితుల్లో, ముఖ్యమంత్రి విజయ్ ఈ ప్రాజెక్ట్ విషయంలో త్రిషకు జాగ్రత్తగా ఉండాలని సూచించినట్లు కోలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
ఇక మరో కారణం కూడా ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. గతంలో కమల్ హాసన్‌తో కలిసి త్రిష నటించినచీకటి రాజ్యం, థగ్ లైఫ్ వంటి చిత్రాలు ఆశించిన విజయాన్ని అందుకోకపోవడంతో, సెంటిమెంట్ పరంగానూ ఆమె ఈ సినిమా విషయంలో వెనక్కి తగ్గుతున్నట్లు టాక్ వినిపిస్తోంది.
అయితే ఈ వార్తలపై ఇప్పటివరకు త్రిష అధికారికంగా స్పందించలేదు.
మెటా డిస్క్రిప్షన్
రజినీకాంత్-కమల్ హాసన్ భారీ మల్టీస్టారర్ నుంచి త్రిష తప్పుకుంటుందనే వార్తలు కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. రాజకీయాలు, సెంటిమెంటే కారణమా?
హీరో, దర్శకుడు, డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ఇలా అనేక విధాలుగా పాపులర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence). "ముని", కాంచన సినిమాల…
మహేష్ బాబు,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'గుంటూరు కారం' (Guntur Kaaram) సినిమా గురించి ఇప్పుడు ప్రత్యేకంగా…
పూజ హెగ్డే (Pooja Hegde)కి ఇప్పుడు లక్ తిరిగినట్టు కనిపిస్తోంది. ఆమెకి హిట్స్ లేవు కానీ వరుసగా అవకాశాలు వస్తూనే…
ఈ రోజు అల్లరి నరేష్ (Allari Naresh) పుట్టిన రోజు. దాంతో, నరేష్ కొత్త సినిమా "రంభ ఊర్వశి మేనక"…
విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'నాగబంధం'(Nagabandham)లో నభా నటేష్ (Nabha Natesh) మెయిన్ హీరోయిన్ గా…
సినిమా అవకాశాలు తగ్గినా, తాను అనుకున్న తరహా పాత్రలు రాకపోయినా పర్వాలేదని, తనకంటూ ఒక సంతోషకరమైన వ్యక్తిగత జీవితం ఉందని…