అన్నీతానై ఉపేంద్ర తీసిన సినిమా ‘యూఐ’. ఈ సినిమా కథ అతడే రాసుకున్నాడు. తనే దర్శకత్వం వహిస్తూ, హీరోగా నటించాడు. ఇప్పుడీ సినిమాను ప్రభాస్ నటించిన ‘కల్కి’తో పోలుస్తున్నాడు ఉపేంద్ర.
‘కల్కి’లో కాంప్లెక్స్ ఉంటుంది. ఆ సెటప్, మనుషులు, దుస్తులు, ఆయుధాలు అన్నీ ప్రత్యేకంగా ఉంటాయి. సరిగ్గా ‘యూఐ’ సినిమాలో కూడా అలాంటి సెటప్పే కనిపిస్తోంది. పైగా ‘కల్కి’, ‘యూఐ’ సినిమాలు రెండూ ఫ్యూచరిస్టిక్ సినిమాలే.
‘కల్కి’ సినిమా కథ మహాభారత యుద్ధంతో మొదలై, 2898 సంవత్సరం వరకు నడుస్తుంది. ‘యూఐ’ సినిమా కూడా 2040లో సెట్ అయిన కథతో సాగుతుంది. ఈ పోలికలు పక్కనపెడితే.. ఆ సినిమాలో మైథలాజికల్ కల్కిని చూశారని.. తన సినిమాలో మాత్రం సైకలాజికల్ కల్కిని చూస్తారని చెబుతున్నాడు ఉపేంద్ర.
మనుషుల సైకాలజీ, వాళ్ల ఆలోచనలను ఈ సినిమాలో చర్చించానంటున్నాడు ఉపేంద్ర. ఈ హీరో సినిమాలకు సాధారణంగా సెన్సార్ ఇబ్బందులుంటాయి. ‘యూఐ’కి మాత్రం ఆ సమస్య లేదని, 2 గంటల 10 నిమిషాల సినిమాను అందరూ చూసి ఎంజాయ్ చేయాలని కోరుతున్నాడు. 20న రిలీజ్ అవుతోంది ఈ మూవీ.
విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'నాగబంధం'(Nagabandham)లో నభా నటేష్ (Nabha Natesh) మెయిన్ హీరోయిన్ గా…
సినిమా అవకాశాలు తగ్గినా, తాను అనుకున్న తరహా పాత్రలు రాకపోయినా పర్వాలేదని, తనకంటూ ఒక సంతోషకరమైన వ్యక్తిగత జీవితం ఉందని…
రాజమౌళి (Rajamouli) సినిమా అంటే పాత రికార్డులు బద్దలవ్వాలి. కొత్త రికార్డులు స్టార్ట్ అవ్వాల్సిందే. వచ్చే ఏడాది విడుదల కానున్న…
రామ్ చరణ్ నటించిన "పెద్ది" (Peddi) సినిమా జూన్ 4న విడుదలైంది. 25 రోజుల తర్వాత ఈ సినిమా పూర్తి…
రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా మంచి పొజిషన్ లో ఉన్నాడు. పాపులారిటీ ఉంది. యూత్ లో క్రేజ్ ఉంది.…
వరుసగా సినిమాలు నిర్మిస్తోన్న సితార ఎంటర్ టైన్ మెంట్స్ (Sithara Entertainments) వచ్చే నెల నుంచి నెలకో సినిమా విడుదల…