మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి – దర్శకుడు పూరి జగన్నాథ్ కలయికలో సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తి మొదలైంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ విషయంలో మేకర్స్ చాలాకాలంగా ఉత్కంఠ కొనసాగించారు.
ఆ ఉత్కంఠకు ఇప్పుడు తెరపడింది. కనుమ పండుగతో పాటు విజయ్ సేతుపతి పుట్టినరోజు సందర్భంగా సినిమా నుంచి ప్రత్యేక అప్డేట్ విడుదలైంది. ఈ చిత్రానికి “Slum Dog – 33 Temple Road” అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ, హీరో ఫస్ట్ లుక్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
ఫస్ట్ లుక్‌లో విజయ్ సేతుపతి అంధుడిగా కనిపించగా, చేతిలో కత్తి పట్టుకున్న ఆయన గెటప్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది. ఈ పాత్ర ద్వారా పూరి జగన్నాథ్ ఒక డిఫరెంట్ కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడనే సంకేతాలు కనిపిస్తున్నాయి.
ఈ సినిమాకు హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తుండగా, పూరి జగన్నాథ్ మరియు ఛార్మీ సంయుక్తంగా నిర్మాణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
అక్కినేని అఖిల్ (Akhil Akkineni), జైనబ్ (Zainab Ravdjee) 2025 జూన్‌లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి జరిగిన వెంటనే ఈ…
రవితేజ (Ravi Teja) కథానాయకుడిగా నటిస్తున్న ‘ఇరుముడి’ (Irumudi) చిత్రంపై ఇటీవల సోషల్ మీడియాలో నెలకొన్న సందేహాలకు తెరపడింది. బుక్‌మైషోలో…
ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ‘దేవర’ నిజమైన బ్లాక్‌బస్టర్ అని నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఏరియాల్లో…
దర్శకుడు ఎం.ఎస్. రాజు రూపొందిస్తున్న కొత్త చిత్రం ‘అగధ’ (Agadha). ఈ సినిమా ప్రచార కార్యక్రమాలకు టీం ఆదివారం ఘనంగా…
ధనుష్ (Dhanush) హీరోగా ఆర్ టేక్ స్టూడియోస్, వండర్‌బార్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న భారీ చిత్రానికి ‘ఓం: చాప్టర్ 1’…
జయకృష్ణ ఘట్టమనేని (Jaya Krishna Ghattamaneni) మొదటి చిత్రం… 'శ్రీనివాస మంగాపురం' (Srinivasa Mangapuram). ఈ నెల 30న విడుదల…