సీనియర్ నాగార్జునకు ఇటీవల కాలంలో సంక్రాంతి సెంటిమెంట్ పట్టుకొంది. ఇంకా నిజం చెప్పాలంటే… సంక్రాంతి సమయంలో తప్ప మిగతా సమయాల్లో తన సినిమాలకు కలెక్షన్లు రావేమో అనే భయం పట్టుకున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే రీసెంట్ గా నాగార్జున నటించిన సినిమాల్లో ఆడిన చిత్రాలు అన్నీ సంక్రాంతి సమయంలో విడుదలైనవే. మిగతా కాలంలో విడుదలైనవి దారుణంగా పరాజయం పాలు అయ్యాయి.
అందుకే, ఇటీవల ఆగస్టు, సెప్టెంబర్ లో సినిమా మొదలు పెట్టి నాలుగు నెలల్లో పూర్తి చేసి సంక్రాంతికి విడుదల చేస్తున్నారు నాగార్జున. గతేడాది “నా సామి రంగ” చిత్రం అలాగే ప్లాన్ చేసి వదిలారు. అది ఆడింది.
మరి ఈ ఏడాది కూడా అలాగే మరో సినిమా సెట్ చేస్తారా అనేది చూడాలి. నాగార్జున ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో “కుబేర” చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ధనుష్ హీరో. నాగార్జున ది కీలక పాత్ర. “కుబేర” వచ్చే ఏడాది వేసవిలో విడుదల అవుతుంది.
సంక్రాంతికి తానే హీరోగా కనిపించే ఒక సినిమాని సెట్ చేసేందుకు నాగార్జున కసరత్తు చేస్తున్నట్లు టాక్. “బంగార్రాజు 2” కానీ మరోటి కానీ మొదలుపెట్టి సంక్రాంతి 2025కి విడుదల చెయ్యాలనుకుంటున్నారాట. మరి అది సెట్ అవుతుందా?
విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'నాగబంధం'(Nagabandham)లో నభా నటేష్ (Nabha Natesh) మెయిన్ హీరోయిన్ గా…
సినిమా అవకాశాలు తగ్గినా, తాను అనుకున్న తరహా పాత్రలు రాకపోయినా పర్వాలేదని, తనకంటూ ఒక సంతోషకరమైన వ్యక్తిగత జీవితం ఉందని…
రాజమౌళి (Rajamouli) సినిమా అంటే పాత రికార్డులు బద్దలవ్వాలి. కొత్త రికార్డులు స్టార్ట్ అవ్వాల్సిందే. వచ్చే ఏడాది విడుదల కానున్న…
రామ్ చరణ్ నటించిన "పెద్ది" (Peddi) సినిమా జూన్ 4న విడుదలైంది. 25 రోజుల తర్వాత ఈ సినిమా పూర్తి…
రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా మంచి పొజిషన్ లో ఉన్నాడు. పాపులారిటీ ఉంది. యూత్ లో క్రేజ్ ఉంది.…
వరుసగా సినిమాలు నిర్మిస్తోన్న సితార ఎంటర్ టైన్ మెంట్స్ (Sithara Entertainments) వచ్చే నెల నుంచి నెలకో సినిమా విడుదల…