ఉదయాన్నే లేచిన వెంటనే తెలుగు ప్రేక్షకులకు బ్రేకింగ్ న్యూస్ ఇచ్చాడు మంచు మనోజ్. సినిమాల్లో ఇక నటించను అని మంచు మనోజ్ ప్రకటించాడు. ప్రస్తుతం చేస్తున్న ‘ఒక్కడు మిగిలాడు’ ప్రాజెక్టుతో పాటు సెట్స్ పై ఉన్న మరో ప్రాజెక్టు మాత్రమే తన ఆఖరి సినిమాలని క్లారిటీ ఇచ్చేశాడు. అయితే ఇంత సడెన్ గా మంచు మనోజ్ ఎందుకింత నిర్ణయం తీసుకున్నాడు అని జనం అంతా గింజుకుంటున్న కొద్దిసేపటికే తన ట్వీట్‌ని డిలీట్ చేశాడు.
దాంతో ఇదేదో సెలబ్రిటీ ట్వీట్ల గూఫప్ అని అందరికీ అర్థమైంది. దానికి బలాన్ని ఇస్తూ ఇంకో ట్వీట్ వేశాడు. “నా రెండో సినిమా గురించి వెరైటీగా ట్వీట్ చేద్దామనుకుంటే ఏదో తేడా కొట్టేసినట్లుందే…” అన్న అర్థంలో వివరణ ఇచ్చాడు. అయితే మంచు మనోజ్ ట్వీట్ల గూఫప్ (కంగాలీ వ్యవహారం) వెనుక అర్థాలు ఇవీ అని సోషల్ మీడియాలో డిస్కో షురూ అయింది.
నిద్రమత్తులో ఏదో ట్వీట్ వేయాలనుకొని ఇలా చేసి ఉంటాడని, దాన్ని కప్పి పుచ్చేందుకు ఇలా కవర్ డ్రైవ్‌లు షురూ చేశాడని సోషల్ మీడియాలో ట్రాలింగ్ మొదలైంది. మరికొందరు ఏమో మనోజ్ తండ్రి, డైలాగ్ కింగ్ మోహన్‌బాబ ఫోన్ చేసి బాగా “హితబోధ” చేసి ఉంటాడనే సెటైర్‌లు కూడా వేస్తున్నారు.
నటి సమంత (Samantha) ఇటీవలే తాను గర్భవతి అని వెల్లడించారు. తల్లి కాబోతున్న విషయాన్ని మీడియా ద్వారా, సోషల్ మీడియా…
కెరీర్ ప్రారంభంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) పడిన కష్టాలు గురించి కొన్ని మాత్రమే బాహ్య ప్రపంచానికి తెలుసు. మరీ…
లెనిన్ (Lenin) తర్వాత భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) తెలుగులో ఏ సినిమా చెయ్యబోతుంది? మొన్నటి వరకు ఆమెని ఐరన్…
ఎన్టీఆర్ కి రాజకీయాలు కొత్త కాదు. 2009లోనే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేశారు. ఐతే, ఆ తర్వాత…
తెలుగులో "ఇడుపు కాయితం" (Idupu Kayitham) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది యూట్యూబ్ సంచలనం నాగదుర్గ (Naga Durga).…
రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఏం మాట్లాడినా, ఏ ట్వీట్ వేసినా అది పీక్స్ లో ఉంటుంది.…