చిరంజీవి సినిమాపై సమ్మె ప్రభావం

TeluguCinema 16 Aug 2025
Chiranjeevi

టాలీవుడ్ లో సినీ కార్మికుల సమ్మె కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మొన్నటివరకు 10-12 సినిమాల షూటింగ్స్ జరిగాయి. ఇప్పుడు అవి కూడా ఆగిపోయాయి. అలా ఆగిపోయిన సినిమాల్లో చిరంజీవి-అనీల్ రావిపూడి సినిమా కూడా ఉంది.

సమ్మె ప్రభావం తమ సినిమాపై గట్టిగా పడిందంటున్నాడు దర్శకుడు అనీల్ రావిపూడి. ప్రస్తుతం నడుస్తున్న షెడ్యూల్ అనుకున్నట్టు జరిగితే, ఈపాటికి సినిమా ఫస్టాఫ్ షూటింగ్ మొత్తం పూర్తయి ఉండేదని వెల్లడించాడు.

అదే ఊపులో అనుకున్న విధంగా షెడ్యూల్ కొనసాగి ఉంటే, సెకండాఫ్ కు సంబంధించి మరో 2 సన్నివేశాల షూటింగ్ కూడా పూర్తయ్యేదని వెల్లడించాడు. సమ్మె కారణంగా తమ సినిమా షెడ్యూల్స్ అన్నీ తారుమారు అయ్యాయని అన్నాడు.

అనీల్ రావిపూడి స్పీడ్ కు జనం షాక్ అవుతున్నారు. అప్పుడే ఫస్టాఫ్ షూటింగ్ పూర్తిచేశావా అంటూ పోస్టులు పెడుతున్నారు. ఆ షాక్ లో ఉంటుండగానే మరో సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఈనెల 22న చిరంజీవి పుట్టినరోజు కానుకగా టీజర్ రిలీజ్ చేయబోతున్నట్టు వెల్లడించాడు.