అలా వదులుకోవాల్సి వచ్చింది

కెరీర్ లో మంచి రాణిస్తున్న టైమ్ లోనే సినిమాల నుంచి తప్పుకున్నారు శ్రీదేవి విజయ్ కుమార్. అప్పుడప్పుడే తమిళ్ లో సెటిల్ అవుతున్న టైమ్ లో ఆమె కెరీర్ కు ఫుల్ స్టాప్ పెట్టారు. దీనిపై ఆమె తాజాగా స్పందించారు.
“నేను హీరోయిన్ గా చేస్తున్న రోజుల్లోనే పెళ్లి చేసుకున్నాను. ఇంట్లో ముందుగానే పెళ్లి ప్లాన్ చేశారు. పెళ్లి తర్వాత అమ్మాయి పుట్టింది. అలా సినిమాలకి ఒక బ్రేక్ వచ్చింది. ఆ తర్వాత టీవీలో కొన్ని ప్రోగ్రామ్స్ చేశాను. ఇన్ని సంవత్సరాల గ్యాప్ తర్వాత మళ్లీ సినిమాల్లోకి వచ్చాను. నన్ను నేను స్క్రీన్ పై చూసుకోవడం చాలా బాగుంది.”
‘సుందరకాండ’ సినిమాతో నటిగా రీఎంట్రీ ఇస్తోంది శ్రీదేవి.
తన కూతురు ఇప్పుడు పెద్దదైందని, కాబట్టి తను మరిన్ని సినిమాలు చేస్తానని చెబుతోంది. గతేడాది ఆమె నటించిన ఈశ్వర్ సినిమా రీ-రిలీజ్ అయింది. అది తనకు మంచి అనుభవం అంటోంది శ్రీదేవి. ప్రభాస్ ఇప్పటికీ టచ్ లో ఉంటాడని, తనకు బెస్ట్ ఫ్రెండ్ అని చెబుతోంది.
ALSO READ: Sridevi Vijaykumar: Prabhas is still a very good friend