మా ఆయన వల్ల పేరు రాలేదు

ఉపాసన కొణిదెలకి ప్రత్యేకమైన పేరు ఉంది. అపోలో హాస్పిటల్ వ్యాపార రంగంలో ఆమె తలమునకలై ఉన్న విషయం మనకు తెలుసు. ఆమె తాత ఈ ఆసుపత్రిని స్థాపించారు. ఈ వ్యాపారంలో ఒక విభాగాన్ని ఆమె రన్ చేస్తున్నారు. అలా వ్యాపారవేత్తగా ఆమెకి ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది.
అందుకే, తనకి ఉన్న పేరు, పాపులారిటీ తన భర్త వల్ల రాలేదని చెప్తున్నారు. తన విజయం తనదే అని పేర్కొంటున్నారు.
పెళ్లి చేసుకున్న వ్యక్తి వల్లో, కుటుంబ వారసత్వం వల్లో మహిళలను గుర్తించొద్దని, వాళ్ళ సొంత ప్రతిభని, విజయాలను గుర్తించండి అనేది ఆమె భావన. తన భర్త రామ్ చరణ్ ని కానీ, తమ కుటుంబాన్ని కానీ ఆమె తక్కువ చెయ్యడం లేదు. తనకి కూడా సొంతంగా టాలెంట్ ఉందని, తనకి ఇప్పటివరకు దక్కిన పేరు అంతా తన కష్టమే అని ఆమె చెప్తున్నారు.
రామ్ చరణ్, ఉపాసన ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక పాప. మెగాస్టార్ కుటుంబం పేరుప్రఖ్యాతులు ఉన్న కుటుంబమే. బోలెడంత ఆస్తులు. ఐతే, ఉపాసనకు కూడా వారసత్వంగా బోలెడంత ఆస్తి ఉంది. ఆమె వ్యాపార రంగంలోకి అడుగుపెట్టాక ఆమె మరింతగా పెంచారు.
ఉపాసన ఇన్ స్టాగ్రామ్ లో కూడా చాలా యాక్టివ్. ఆమెకి సొంతంగా 12 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. అలాగే వీరి ఫ్యామిలీ అధికారంలో ఉన్న పార్టీలతో సఖ్యంగా ఉంటుంది. కాబట్టి ఇటీవల ఒక గౌరవ పదవి కూడా వచ్చింది తెలంగాణ స్పోర్ట్స్ కి సంబంధించి.