ఒక్క ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్!

కీర్తి సురేష్ పరిస్థితి అలా మారింది. ప్రస్తుతం ఈ భామకి ఒక్కటంటే ఒక్క ఛాన్స్ రావడం లేదు మరి. అదిగో ఇదిగో అని ఆమె పేరు పలు సినిమాల విషయంలో పరిశీలన వరకు వచ్చి బ్రేకులు పడ్తున్నాయి. దాంతో దాదాపు తొమ్మిది నెలలుగా ఈ అమ్మడు ఖాళీ.
గతేడాది డిసెంబర్ లో ఆమె పెళ్లి చేసుకొంది. పెళ్లి జరిగిన మూడు రోజులకే తన హిందీ సినిమా ప్రమోషన్ లలో పాల్గొంది. కేరీర్ విషయంలో అంత కమిట్మెంట్ చూపింది. పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తాను అని ముందే చెప్పింది. కానీ ఆమె పెళ్లి తర్వాత కొత్తగా ఒక్క సినిమా సైన్ చెయ్యలేకపోయింది.
హిందీలో ఆమె మొదటి చిత్రం ఫ్లాప్ కావడం, తెలుగులో ఆమెని పెద్ద సినిమాల్లో తీసుకోకపోవడంతో గ్యాప్ పెరిగిపోతోంది. తమిళంలో ఆమెకి మొదటి నుంచి అంతంతమాత్రమే అవకాశాలు.
ప్రస్తుతం ఈ భామ కేవలం సోషల్ మీడియాపైనే దృష్టి పెట్టాల్సి వస్తోంది.
ఆంటోని తట్టిల్ అనే తన బాయ్ ఫ్రెండ్ ని ఈ భామ పెళ్లాడింది. అతను ఆమె కెరీర్ కోసమే ఇండియాలోనే సెటిల్ అయ్యాడు. అంతకుముందు దుబాయిలో ఉండేవాడు. మరి కొత్త ఏడాది 2026లో కనీసం ఒకటి అయినా సినిమా చేసే అవకాశం వస్తుందా?