
విజయ్ దేవరకొండ ఈ ఏడాది “కింగ్ డమ్” సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. కానీ ఆ సినిమా అనుకున్నంత స్థాయిలో ఆడలేదు. మొదట భారీ కలెక్షన్లతో హిట్ అవుతుంది అనిపించింది కానీ ఆ తర్వాత ఆ సినిమా నిలబడలేదు. అయినా డీలా పడకుండా రెండు కొత్త సినిమాలని మొదలుపెట్టాడు విజయ్ దేవరకొండ.
విజయ్ దేవరకొండ ఇప్పటికే దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసి కొంత భాగం పూర్తి చేశాడు. ఇందులో విజయ్ సరసన రష్మిక నటిస్తోంది. ప్రస్తుతం ఈ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది.
మరోవైపు, “రౌడీ జనార్దన్” అనే మరో చిత్రాన్ని ఇటీవల ప్రారంభించాడు. ఈ సినిమా షూటింగ్ ఇటీవల మహారాష్ట్ర – తెలంగాణ బోర్డర్ లో మొదలైంది. దర్శకుడు రవికిరణ్ కోలా తీస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజ్ నిర్మిస్తున్నారు. ఒక రెండు రోజుల పాటు విజయ్ ఈ షూటింగ్ లో పాల్గొన్నాడు.
ఒక వారం ఈ సినిమా షూటింగ్ లో మరో వారం ఆ సినిమా షూటింగ్ లో పాల్గొంటూ రెండూ ఏక కాలంలో పూర్తి చేసే ఆలోచనలో ఉన్నట్లు ఉన్నాడు.





