అత్తమ్మగా సూట్ అవుతానా: రేణు

పవన్ కళ్యాణ్ మాజీ భార్య, నటి రేణు దేశాయ్ మళ్ళీ నటిస్తున్నారు. ఆ మధ్య రవితేజ సినిమాలో ఒక పాత్ర పోషించిన రేణు దేశాయ్ తాజాగా “పదహారు రోజుల పండుగ” అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఈ రోజు ప్రారంభం అయింది.
వినాయకుడు, విలేజ్ లో వినాయకుడు, కేరింత వంటి విజయవంతమైన చిత్రాలని అందించిన డైరెక్టర్ సాయికిరణ్ అడివి దర్శకత్వంలో ’16 రోజుల పండగ’ రూపొందుతోంది. సాయి కృష్ణ దమ్మాలపాటి హీరోగా పరిచయం అవుతున్నారు. గోపిక ఉదయన్ హీరోయిన్. ఈ చిత్రంలో రేణు దేశాయ్ అత్తగా నటిస్తుండగా, అనసూయ భరద్వాజ్, వెన్నల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఐతే తాను ఈ పాత్రకు సూట్ అవుతానా అనే డౌట్ వచ్చిందట రేణు దేశాయ్ కి.
“సాయి కిరణ్ కోవిడ్ లాక్ డౌన్ కి ముందే ఈ కథ చెప్పారు. నాకు చాలా నచ్చింది. వెంటనే చేస్తానని చెప్పాను. ఇందులో అత్తమ్మ రోల్ చేస్తున్నాను. నా ఏజ్ కి సరిపోతుందా అనిపించింది. కానీ ఆ పాత్ర, కథ అద్భుతమైనది. సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులకే అర్ధమైపోతుంది. సాయి కిరణ్ చాలా మంచి దర్శకుడు. తనతో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది,” అని ఆమె తెలిపారు.
రేణు దేశాయ్ కొడుకు అకీరా నందన్ కూడా త్వరలో హీరోగా నటిస్తున్నాడు.