గుడ్ న్యూస్… టైం వచినప్పుడే

TeluguCinema 18 Dec 2025
Naga Chaitanya and Sobhita

నాగ చైతన్య (Naga Chaitanya), శోభిత (Sobhita) గతేడాది డిసెంబర్ లో పెళ్లి చేసుకున్నారు. ఇటీవలే ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ ఘనంగా జరుపుకున్నారు చైతన్య, శోభిత. ఐతే, వీరు ఇప్పుడు తల్లితండ్రులు కాబోతున్నారు అని కొంతకాలంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఇద్దరూ స్పందించలేదు కానీ నాగార్జున అక్కినేని తాజాగా మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

మీరు తాతయ్య కాబోతున్నారట, నిజమేనా అని మీడియా అడిగితే నాగార్జున నవ్వారు. ఆయన ఆ ప్రచారాన్ని కొట్టి పారెయ్యలేదు.

“గుడ్ న్యూస్ అనేది టైం వచ్చినప్పుడే చెప్తాను,” అని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు.

నాగ చైతన్య అంతకుముందు సమంతని పెళ్లాడాడు. నాలుగేళ్ల కాపురం తర్వాత విడిపోయారు. సమంతతో నాగ చైతన్యకి పిల్లలు కలగలేదు. దాంతో, ఇప్పుడు చైతన్య తనకు మనవడో, మనవరాలినో ఇస్తే బాగుండు అని నాగార్జున అనుకుంటున్నట్లు సమాచారం. పెళ్ళై ఏడాది కావడంతో వీళ్లకు ఇక “గుడ్ న్యూస్” గురించి ప్రశ్నలు, ప్రచారాలు ఎక్కువ అవుతాయి.

నిజంగా శోభిత ప్రెగ్నెంటా కాదా అనేది మరి కొన్ని నెలలు ఆగితే తేలుతుంది.

Sobhita

మరోవైపు, శోభిత తన మోడలింగ్ ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తూనే ఉంది. ఆమె ఫోటోలను చూస్తుంటే ప్రెగ్నెంట్ లేడీలా కనిపించడం లేదు.