సేవలో ప్రణీత, సంజన పోటీ

TeluguCinema 16 Jun 2021
Pranitha and Sanjjana

కన్నడ సినిమా పరిశ్రమకి చెందిన ప్రణీత సుభాష్, సంజనా గల్రాని ఇటీవలే ఓ ఇంటివారయ్యారు. లాక్డౌన్లో నితిన్ అనే వ్యాపారవేత్తని ప్రణీత పెళ్లి చేసుకొంది. సంజనా కూడా ఒక వైద్యుడిని రహస్యంగా పెళ్లి చేసుకొంది. ఆ విషయాన్ని ఆర్నెళ్లు దాచింది. మొత్తానికి గత నెలలో తనకు పెళ్లి జరిగిన విషయాన్ని బయటపెట్టింది.

వీరు ఇప్పుడు సేవా కార్యక్రమాలతో బిజీగా మారిపోయారు. కరోనా రెండో వేవ్ లో నిత్యావసర వస్తువులు కూడా లేక ఇబ్బందిపడుతున్న పేదవారికి సంజన సరుకులు అందించడం, నిత్యం అన్నదానం చెయ్యడం వంటివి చేస్తోంది సంజన.

ఇక ప్రణీత తన పేరు మీద ఒక ఫౌండేషన్ స్థాపించింది. ఈ ఫౌండేషన్ తరఫున వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టింది. సినిమాల్లో గ్లామర్ పాత్రలు పోషించి మంచి డబ్బు సంపాదించిన ఈ కన్నడ భామలు ఇప్పుడు చారిటీ కార్యక్రమాల్లోనూ ముందు నిలవడం విశేషం.

ప్రణీత త్వరలోనే బీజేపీలో చేరుతుందనే వార్తలు కూడా వస్తున్నాయి. ఐతే, సంజనకి మాత్రం అలాంటి ఆలోచనల్లేవు.