అలా అదరగొడుతోన్న రష్మిక

TeluguCinema 15 Jan 2023
rashmikaglamshow1

రష్మిక మందాన ఇప్పుడు పూర్తి స్థాయి కమర్షియల్ సినిమాల హీరోయిన్ గా మారిపోయింది. పెద్ద హీరోల సినిమాల్లో హీరోయిన్లకు పెద్దగా ప్రాధాన్యత ఉండదు. కేవలం పాటల్లో గ్లామరస్ గా కనిపించాలి. రష్మిక ఇప్పుడు అదే పద్దతిని పాటిస్తోంది.

తాజాగా దళపతి విజయ్ సరసన ఆమె నటించింది. ‘వారసుడు’ చిత్రంలో ఆమె హీరోయిన్. ఒక రెండు సీన్లలో కనిపిస్తుంది. రెండు పాటల్లో మాత్రం అందాలు ఆరబోసింది. ఒక పాటలో (Jimikki Ponnu) పూర్తిగా మైక్రో గౌన్ వేసుకొని ఆమె చేసిన డ్యాన్స్ చేసింది. ఈ సినిమాలో ఆమె గ్లామర్ షో మామూలుగా లేదు.

రష్మిక గ్లామర్ రూట్ కి వచ్చి చాలా కాలమే అయింది. ఆ విషయంలో ఇప్పుడు ఆమె హద్దులు చెరిపేసినట్లు కనిపిస్తోంది.

ఇటీవల ఆమె చేసిన కామెంట్స్ చాలా వివాదాలు సృష్టించాయి. కాంట్రవర్సీలు ఎలా ఉన్నా పెద్ద సినిమాల్లో కనిపిస్తూ తన కెరీర్ ని బిల్డ్ చేసుకుంటోంది. ప్రస్తుతం ఆమె చేతిలో బాలీవుడ్ లో రణబీర్ కపూర్ ‘యానిమల్’ ఉంది. తెలుగులో ‘పుష్ప 2’ ఉంది.