అదా అస్సలు ఆదా చేయడం లేదుగా!

అదా నుంచి అందాల విందు కొత్త కాదు. తన నుంచి కొత్త కొత్త అందాల్ని ఎప్పటికప్పుడు ప్రదర్శిస్తూనే ఉంటుంది ఈ పిల్ల. ఇక ఈమెలో చూడ్డానికి ఏమీ లేదని అనుకున్న ప్రతిసారి మైమరిపించేలా స్టిల్స్ రిలీజ్ చేస్తుంటుంది. తాజాగా మరోసారి తన అందాల విందును రుచిచూపించింది ఈ ముద్దుగుమ్మ.

ఆల్ మోస్ట్ టాప్ లెస్ అనిపించేలా ఉన్న ఈ స్టిల్స్ చూస్తే అందాల ప్రదర్శనలో అదా అస్సలు పొదుపు పాటించదనే విషయం అర్థమౌతుంది. అసలే వైట్ స్కిన్ టోన్. దానిపై స్కిన్ షో. దీంతో చూపు తిప్పుకోవడం ఎవ్వరి తరం కావడం లేదు.

Also Check: Adah Sharma Photos

అయితే ఈ అందగత్తెకు ఒకటే లోటు. ఒంటి నిండా గ్లామర్ అయితే ఉంది కానీ టీ స్పూన్ అంత అదృష్టం కూడా లేదు. అందుకే టాలీవుడ్ లో పెద్దగా క్లిక్ అవ్వలేకపోయింది.

అన్నట్టు ఈ లాక్ డౌన్ టైమ్ లోనే తెలుగులో ఓ సినిమా స్టార్ట్ చేసి, పూర్తిచేసింది అదా. దాని పేరు “క్వశ్చన్ మార్క్”. ఫస్ట్ కాపీ రెడీ అయ్యే టైమ్ కు థియేటర్లు తెరిస్తే ఓకే. లేదంటే అందాలు ఓటీటీకే.

Related Stories