అక్షయ్ కుమార్ ధైర్యం చేశాడు

Akshay Kumar in Bell Bottom

బాలీవుడ్ పెద్ద సినిమాలు ఏడాదిన్నర కాలంగా థియేటర్ల ముఖం చూడలేదు. కరోనా మొదటి వేవ్ మొదలుకాకముందే విడుదలలన్నీ ఆగిపోయాయి. ఈ వేసవిలో విడుదల చెయ్యాలని ప్లాన్ చేసుకుంటే రెండో వేవ్ వచ్చి పడింది. సల్మాన్ ఖాన్ నటించిన ‘రాధే’లాంటి బడా సినిమా కూడా థియేటర్లో విడుదల కాలేదు. డైరెక్ట్ గా డిజిటల్ ప్రీమియర్ పొందింది.

ఐతే, ఇప్పుడు అక్షయ్ కుమార్ ధైర్యం చేస్తున్నాడు. జులై 27న ‘బెల్ బాటమ్’ అనే తన సినిమాని థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రకటించాడు. థియేటర్ వ్యాపారానికి ఊపు తీసుకురావాలంటే పెద్ద సినిమాలు విడుదల కావాలి. ఆ మొదటి అడుగు అక్షయ్ కుమార్ వేస్తున్నాడు.

తెలుగు సినిమాలు కూడా ఆగస్టు కానీ, సెప్టెంబర్ లో కానీ విడుదల అయ్యే అవకాశం ఉంది.

Advertisement
 

More

Related Stories