‘F3’ కోసం ‘అల’ సెట్?

వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్న, మెహ్రీన్ నటిస్తున్న “ఎఫ్ 2” సీక్వెల్ రెగ్యులర్ షూటింగ్ ఈ రోజు హైదరాబాద్ లో మొదలైంది. ఫస్ట్ డే లొకేషన్ లో వెంకటేష్ పైనే కీలక సీన్లు తీస్తున్నారు. వరుణ్ తేజ్, తమన్న, మెహ్రీన్ కొద్దీ రోజుల తర్వాత జాయిన్ అవుతారట.

వెంకటేష్ “నారప్ప” షూటింగ్ గెటప్ తీసేసి, “ఎఫ్ 3” లుక్ లోకి మారిపోయాడు. ఇందులో స్మార్టుగా, యంగ్ గా ఉంటాడు వెంకీ. ఈ సీక్వెల్ లో దర్శకుడు అనిల్ రావిపూడి గ్లామర్ డోస్ కూడా పెంచుతున్నాడు. వెంకటేష్, తమన్నపై మంచి రొమాంటిక్ సాంగ్స్ ప్లాన్ చేశాడట.

మరోవైపు, ఈ సినిమాలోని కొన్ని కీలక సీన్ల కోసం ఒక బిగ్ హౌస్ సెట్ ని వెయ్యనున్నారు. ఇప్పటికి వర్కింగ్ కండిషన్ లో ఉన్న “అల వైకుంఠపురం” ఇల్లు సెట్ ని కొంచెం మార్పులు చేసి ఈ సినిమా కోసం వాడుతారని టాక్.

Advertisement
 

More

Related Stories